విజయ దేవరకొండ .. మహర్షి ఆడియో ఫంక్షన్ లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మహేష్ అభిమానులకు నచ్చడం లేదు. ఆ మహేష్‌కి వున్న చాలామంది అభిమానుల్లో తానూ ఒకడినని విజయ్‌ దేవరకొండ చెప్పుకొచ్చాడు 'మహర్షి' ప్రీ రిలీజ్ వేడుకలో. కానీ, ఇదే ఈవెంట్‌లో విజయ్‌ ఆటిట్యూడ్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 'మహేష్‌ సర్‌' అనాలంటే అభిమానిగా కొంత ఇబ్బందిగా వుందని విజయ్‌ చెప్పడమే ఆ చర్చకు కారణం. 


చిరంజీవి కావొచ్చు, బాలకృష్ణ కావొచ్చు.. ఇంకో అగ్ర హీరో కావొచ్చు.. ఆయా హీరోల గురించి మాట్లాడాల్సి వస్తే, 'గారు' అనకుండా వుండగలరా.? ఇంకాస్త చనువు వుంటే 'అన్నయ్య' అని పిలుస్తుంటారు. విజయ్‌ దేవరకొండకి 'బ్రదర్‌' అనడం అలవాటే. 'అన్నయ్యా' అని కూడా అనేయొచ్చు మహేష్‌ని. కానీ, ఎందుకో విజయ్‌, 'సర్‌' అని మహేష్‌ని పిలవడానికి ఇబ్బంది పడ్డాడు.  నిజానికి మహేష్‌ నోట 'సర్‌' అనే పదం చాలా ఎక్కువగా వస్తుంటుంది.


తనకంటే వయసులో చిన్నవారినైనా 'సర్‌' అని పిలుస్తుంటాడు మహేష్‌. అది ఆయన ఇతరులకు ఇచ్చే గౌరవం మాత్రమే కాదు, తన హుందాతనాన్ని చాటుకోవడం కూడా. 'నేను మహేష్‌ అభిమానిని..' అని చెప్పేసి, 'సర్‌' అనడం కష్టంగా వుందనడం, 'సర్‌' అనేందుకు ప్రయత్నిస్తానంటూ సమర్థించుకోవడం.. ఎందుకో ఈ తతంగాన్ని చూసిన మహేష్‌ అభిమానులకీ ఏమంత నచ్చలేదు. విజయ్‌ ఆటిట్యూడ్‌ విషయమై మొదటినుంచీ చాలా విమర్శలున్నాయి.. ఆ ఆటిట్యూడ్‌ ఇప్పుడు ఇంకోసారి వివాదాస్పదమవుతున్నట్లే భావించాలేమో.!

మరింత సమాచారం తెలుసుకోండి: