ఇప్పటివరకు మహర్షి పాటలు గాని , టీజర్ గాని జనాలను మెప్పించలేదని చెప్పాలి. దీనితో సినిమా మీద రావాల్సినంత బజ్ క్రియేట్ కాలేదు. దీనితో ఎట్టకేలకు యూనిట్ కోరుకున్న ఆ మూమెంట్ రానే వచ్చింది. మహర్షిపై అంచనాలు అమాంతం పెరిగాయి. హైప్ డబుల్ అయింది. దీనికి కారణం కేవలం మహర్షి ట్రయిలర్.  అవును.. మహర్షి ట్రయిలర్ లో అన్నీ ఉన్నాయి. ఫన్, ఎమోషన్, యాక్షన్, సెంటిమెంట్.. ఇలా అన్నీ ఉన్నాయి.


అందుకే మహర్షి ట్రయిలర్ అందరికీ నచ్చింది. కాకపోతే టీజర్ లానే ట్రయిలర్ లో కూడా మహేష్ పైనే ఫోకస్ పెట్టారు. ట్రయిలర్ మొత్తం అతడి చుట్టూనే తిరిగింది. మధ్యలో పూజగా పూజా హెగ్డే, రవి పాత్రలో అల్లరి నరేష్ ఇలా వచ్చి అలా వెళ్లిపోతారు. ప్రపంచాన్ని ఏలేద్దాం అనుకునే రిషి అనే వ్యక్తి మహర్షిగా ఎలా మారాడు అనేదే ఈ సినిమా. యూనిట్ ముందు నుంచి చెబుతున్నట్టుగానే ఇది రిషి అనే క్యారెక్టర్ సాగించిన ప్రయాణం.


ఆ జర్నీ ఆడియన్స్ కు కనెక్ట్ అయితే సినిమా సూపర్ హిట్. స్టూడెంట్, బిజినెస్ మేన్, రైతు పాత్రల్లో మహేష్ హ్యాండ్సమ్ గా కనిపించాడు. కాకపోతే ట్రయిలర్ లో రైతు పాత్రకు సంబంధించి ఎక్కువ మేటర్ బయటపెట్టలేదు. సినిమాకు అదే కీలకం అనే విషయం అర్థమౌతూనే ఉంది. మొత్తమ్మీద మహర్షి సినిమాకు పాటలతో రాని క్రేజ్, ఈ ట్రయిలర్ తో ఒక్కసారిగా వచ్చింది. ఈనెల 9న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోంది మహర్షి సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: