గత సంవత్సరం కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ బాబు తాజాగా వంశి పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’సినిమాలో నటించారు.  ఈ సినిమా మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం నాడు మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోనే పీపుల్స్ ప్లాజాలో భారీ ఎత్తును నిర్వహించారు.  ఈ సందర్భంగా పలువురు సినీ నటులు, దర్శకులు వచ్చారు.  ముఖ్య అతిధిలుగా వెంకటేష్, విజయ్ దేవరకొండ విచ్చేశారు.  


ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుతూ..నా సినీ కెరీర్ చిన్న నాటి నుంచే ప్రారంభం అయ్యింది.  అయితే నేను హీరోగా ‘రాజకుమారుడు’తో పరిచయం చేశారు రాఘవేంద్ర గారు..ఆయనకు నా జన్మంతా రుణపడి ఉంటా.  ఇక నన్ను మంచి నటుడిగా ఆవిష్కరించిన సినిమా మురారి..ఈ సినిమా దర్శకులు కృష్ణవంశికి ధన్యవాదాలు. నన్ను స్టార్ చేసిన సినిమా 'ఒక్కడు' దాన్ని ఎప్పటికీ మర్చిపోలేను.. గుణశేఖర్ గారిని థాంక్స్. నన్ను ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర చేసిన సినిమా 'అతడు'.. అది తీసిన త్రివిక్రమ్ గారికి థాంక్స్. నా లైఫ్ లో టర్నింగ్ పాయింట్ 'దూకుడు' ఆ సినిమా చేసిన శ్రీనువైట్ల గారికి థాంక్స్.


ఇక శ్రీమంతుడు,భరత్ అనే నేను లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన కొరటాల శివకు ఋణపడి ఉంటాను. ఇప్పుడు నా 25వ సినిమా తీసిన వంశీ నాకు సోదరుడు లాంటి వాడు..అయితే కథ చెప్పడానికి వచ్చినపుడు పది నిమిషాలు విని పంపించేద్దాం అనుకున్నా(నవ్వుతూ).. అప్పటికే రెండు సినిమాల కమిట్మెంట్స్ ఉండడంతో కుదరదు అనుకున్నా కానీ నేరేషన్ వినగానే  నచ్చింది...మనసు కదిలించేలా ఉంది.  కానీ ఈ సినిమాకు టైమ్ పడుతుందని చెప్పాను..అయినా పరవాలేదని అన్నాడు.  దానికి ఆయన ఎప్పటికీ రుణపడి ఉంటాను. నాకోసం రెండేళ్లు ఎదురుచూశారు. దేవిశ్రీ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ముగ్గురు నిర్మాతలు ఎంతో సపోర్ట్ చేశారు వారందరికీ నా ధన్యవాదాలు అన్నారు మహేష్ బాబు. 


మరింత సమాచారం తెలుసుకోండి: