తన సినిమాలతోనే కాదు..తన వ్యాఖ్యలతో కూడా ఎప్పుడూ కాంట్రవర్సీలు సృష్టిస్తుంటారు రాంగోపాల్ వర్మ.  గతంలో పలు కాంట్రవర్సీ సినిమాలు తీసిన  రాంగోపాల్ వర్మ కొంత కాలంగా తన ట్వీట్స్ తో అన్ని రంగాల వారిని టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే.  ఎప్పుడూ ఎవరిమీదో ఒకరి మీద విమర్శలు  చేస్తూ.. సెటైర్లు వేస్తూ ఉండటం చూస్తూనే ఉన్నాం.  రాంగోపాల్ వర్మ తీసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’మూవీ కి సంబంధించిన కాంట్రవర్సీ నడుస్తున్న ఈ సమయంలో తాజాగా ఇప్పుడు ప్రధాని మోదీని టార్గెట్ చేసుకున్నారు. 

రెండో ప్ర‌పంచ యుద్ధానికి కార‌ణ‌మైన జ‌ర్మ‌నీ అధినేత అడాల్ఫ్ హిట్ల‌ర్‌, భారత ప్ర‌ధాని మోదీ ఫోటోల‌ని జ‌త చేసి సేమ్ టూ సేమ్ అనే కామెంట్ పెట్టాడు.  ప్ర‌ధాని మోదీ ఓ విదేశీ యాత్రలో చిన్నారితో తీసుకున్న ఫోటోతో పోల్చుతూ పోస్ట్ చేశారు.  అప్పట్లో హిట్లర్, ఇప్పుడు మోదీ ఇద్ద‌రు చిన్నారుల చెవులు ప‌ట్టుకొని ఉండ‌డం విశేషం.  అయితే ఈ ఫోటోతో వ‌ర్మ ఏం చెప్ప‌ద‌ల‌చుకున్నాడు అని నెటిజ‌న్స్ చ‌ర్చించుకుంటున్నారు.  మరోవైపు తాను నిర్మించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఏపిలో ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేయాలని తెగ కష్టపడుతున్నారు వర్మ. 

ఈ నేపథ్యంలో మే 1న సినిమా విడుద‌ల కానుంద‌ని అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించిన‌, ఎన్నిక‌ల కోడ్ అమలులో ఉన్నందున `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌`ను విడుద‌ల చేయ‌వ‌ద్ద‌ని కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ సూచించింది.  కాగా, సినిమా విడుద‌ల‌కి కొంద‌రు అడ్డుప‌డుతున్నార‌ని వ‌ర్మ ఇన్‌డైరెక్ట్‌గా చంద్ర‌బాబుని దూషిస్తూ వ‌స్తున్నాడు. ఇప్పుడు మోదీ ని హిట్లర్ తో పోల్చడం..దీనిపై బీజేపీ నేతలు ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: