స్టార్ డైరెక్టర్ వంశి పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు-పూజా హెగ్డె నటించిన ‘మహర్షి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ బుధవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.  ఈ సినిమాను వైజయంతి మూవీస్,శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా బ్యానర్‌లు సంయుక్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించాయి.  ఈ వేడుకకు టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్‌తో పాటు, క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథులుగా హాజరై సందడి చేసారు. ఇక ప్రి రిలీజ్ వేడుకలో మాట్లాడిన మహేష్ బాబు ..తన కెరీర్‌లో బెస్ట్ నిలిచిపోయిన సినిమాల గురించి ప్రస్తావించడం హాట్ టాపిక్‌గా మారింది.  


తన మొదటి సినిమా దర్శకుడు రాఘవేంద్ర రావు తో మొదలు పెట్టి వంశి పైడిపల్లి గురించి మాట్లాడారు.  ఈ సందర్భంగా ‘రాజకుమారుడు’, ‘ఒక్కడు’, ‘అతడు’, ‘శ్రీమంతుడు’,‘భరత్ అను నేను’ సినిమాల గురించి చెప్పిన మహేష్ బాబు.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పోకిరి’ సినిమా గురించి ప్రస్తావించక పోవడం అటు సినీ వర్గం, ఇటు ఫ్యాన్స్ షాక్ కి గురయ్యారు. 

మహర్షి వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సమయంలో ‘పోకిరి’సినిమా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.  ఈ సినిమా మహేష్ స్టార్ డమ్ ని ఒక్కసారే పైకి తీసుకు వచ్చింది. ఆ తర్వాత మహేష్‌కు మరో బ్లాక్‌బాస్టర్ సినిమా బిజినెస్‌మ్యాన్‌ని ఇచ్చింది కూడా పూరి జగన్నాధ్..అలాంటిది ఆయన పేరు ప్రస్థావించకపోవడం ఒకంత బాధకలిగించే విషయమే అని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడ్డారు.  


ఈ విషయం ఆ నోటా ఈ నోటా విన్న మహేష్ బాబు వెంటనే తన పొరపాటు గ్రహించారు.   ఈ విషయంపై మహేష్ బాబు వెంటనే స్పందించారు.. ట్విట్టర్ వేదికగా పూరీకి క్షమాపణ చెప్పాడు. ‘ఇవాళ నా స్పీచ్‌లో ఇంపార్టెంట్ పర్సన్ పేరు చెప్పడం మర్చిపోయాను. పోకిరి నన్ను సూపర్ స్టా‌ర్‌ని చేసింది. పోకిరిలాంటి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్యూ సో మచ్ పూరీ.. ఈ సినిమా నాకెప్పటికీ గుర్తుండిపోతుంది’ అని ట్వీట్ చేసాడు మహేష్.


దానికి వెంటనే పూరి కూడా స్పందించారు.. ‘థ్యాంక్యూ సో మచ్ సార్, ఆల్వేస్ లవ్ యూ, మహర్షి ట్రైలర్ ఈజ్ రాకింగ్’.. అంటూ, మహేష్ ట్వీట్‌కి రిప్లై ఇచ్చాడు పూరీ జగన్నాథ్. 

మరింత సమాచారం తెలుసుకోండి: