మెగా ఫ్యామిలీలో మెగా నిర్మాత అల్లు అర‌వింద్‌, మెగా స్టైలీష్ హీరో అల్లు అర్జున్ మ‌ధ్య చెడిందా ?  ఓ విష‌యంలో ఈ తండ్రి, కొడుకుల మ‌ధ్య విబేధాలు రావ‌డంతో వీరి మ‌ధ్య గ్యాప్‌న‌కు కార‌ణ‌మైందా ? అంటే ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో అవున‌నే చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. మ‌రి వీటిల్లో నిజానిజాలు ఏంట‌న్న‌ది వారికే తెలియాలి గాని... ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ చ‌ర్చ ప్ర‌కారం బ‌న్నీ గ‌తంలోనే సొంతంగా ఓ బ్యాన‌ర్ పెతాన‌ని ప్ర‌క‌టించాడు. అప్ప‌టి  నుంచి బ‌న్నీ వ‌ర్సెస్ అర‌వింద్ మ‌ధ్య గ్యాప్ ఉంద‌న్న టాక్ ఉంది.


అర‌వింద్ ఇప్ప‌టికే టాప్ నిర్మాత‌గాను, ఇటు థియేట‌ర్ల బిజినెస్‌తో పాటు కొన్ని వ్యాపారాల్లో ఉన్నారు. ఇదే క్ర‌మంలో బ‌న్నీ నాలుగు వ‌రుస హిట్ల‌తో మంచి జోరుమీదున్న టైంలో మ‌ల్టీఫ్లెక్స్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తార‌న్న టాక్ వ‌చ్చింది. ఇది అర‌వింద్‌కు ఇష్టం లేద‌ట‌. ముందుగా నువ్వు సినిమాల మీద కాన్‌సంట్రేష‌న్ చేయ‌మ‌ని చెప్పిన‌ట్టు మేట‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. బ‌న్నీ మాత్రం త‌న విష‌యాల్లోకి అడ్డు రావొద్ద‌ని కూడా అన్న‌ట్టు భోగ‌ట్టా.


ఇక బ‌న్నీ ప్ర‌స్తుతం త‌న తండ్రి బ్యాన‌ర్‌లో చేస్తోన్న సినిమాకు వ‌చ్చే స‌రికి తొలి రోజు మాత్ర‌మే అర‌వింద్ క‌న‌పించాడు. ఆ త‌ర్వాత వ్య‌వ‌హారాల‌న్ని బ‌న్నీ క‌నుస‌న్న‌ల్లోనే న‌డుస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ ప్ర‌చారం ఎలా ఉన్నా బ‌న్నీ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఇవ‌న్నీ అబద్ధం అని కొట్టిప‌డేశాడు. ఈ ప్ర‌చారం చూసిన‌ప్పుడు తాము న‌వ్వుకుంటామ‌ని కూడా అన్నాడు. ఇక ఇండ‌స్ట్రీలోనే కొంద‌రు మాత్రం బ‌న్నీ చెప్ప‌డం వ‌ర‌కే కాని... వాస్త‌వ ప‌రిస్థితులు అలా లేవంటున్నారు. ఏమో లోగుట్టు పెరుమాళ్ల కెరుక‌.


మరింత సమాచారం తెలుసుకోండి: