ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్న సమయంలో ప్రతి ఒక్కరూ చుట్టు ఉంటారు..కానీ ఒక్కసారి స్టార్ డమ్ పోయిందంటే వారి వైపు కన్నెత్తి కూడా చూడరు.  ఏ ఇండస్ట్రీలో అయినా సరే ఇదే తీరు నడుస్తుందని అంటున్నారు ప్రముఖ హీరో డాక్టర్ రాజశేఖర్.  కెరీర్ బిగినింగ్ లో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన రాజశేఖర్ ‘అంకుశం’లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత యాంగ్రీయంగ్ మాన్ గా పేరు తెచ్చుకొని ఎన్నో యాక్షన్ చిత్రాల్లో నటించారు.  ఇదే సమయంలో ఆయన సహనటి అయిన జీవితను పెళ్లి చేసుకున్నారు. 


రాజశేఖర్ ప్రస్తుతం 'కల్కి' సినిమా చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ..ఇండస్ట్రీలో హీరోల నుంచి చిత్రాలు ఆలస్యంగా వస్తుండటానికి కారణం వుంది. ప్రతి హీరో కూడా ఫ్లాప్ కి భయపడతాడు... ఎందుకంటే ఇక్కడ సక్సెస్ లేకపోతే ఎవరూ పట్టించుకోరు .. చూసీచూడనట్టుగా వెళ్లిపోతుంటారు. అందుకే ప్రతి హీరో కథ విషయంలో చాలా కేర్ తీసుకొని ఆలస్యమైనా పరవాలేదు అని అనుకుంటారు. 


 మంచి ప్రాజెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఉండటం వలన మా నుంచి చిత్రాలు తక్కువగా .. ఆలస్యంగా వస్తుంటాయి.  అందుకే నేను గరుడ వేగ లాంటి హిట్ చిత్రంతో నేను రీ ఎంట్రీ ఇచ్చానని..తనకు మరో కథ ఎంచుకోవడానికి సమయం పట్టిందని అన్నారు.  కల్కి కథ చాలా నచ్చిందని.. ఈ చిత్రం మంచి హిట్ అవుతుందని భావిస్తున్నట్టు రాజశేఖర్ అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: