దర్శకుడిగా 100 సినిమాలకు పైగా దర్శకత్వం వహించి, తెలుగు సినిమాకు దర్శకేంద్రుడిగా పేరు తెచ్చుకున్నారు రాఘవేంద్రరావు. ఇప్పుడు ఉన్న బడా హీరోయిలందరిలో చాలా మందిని తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత రాఘవేంద్రరావుగారికే దక్కుతుంది. 

అయితే రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి మాత్రం అటు హీరోగానూ, అటు దర్శకుడిగానూ ఇంతవరకు సక్సెస్ ను అందుకోలేకపోయారు.."అనగ అనగ ఒక ధీరుడు" "మార్నింగ్ రాగ" "సైజ్ జీరో" చిత్రాలు భారీ అపజయాలను మూటకట్టుకున్నాయి. అయితే గత కొద్దీ కాలంగా గ్యాప్ తీసుకున్న ప్రకాష్ ఇప్పుడు "మెంటల్ హై క్యా అనే" చిత్రాన్ని ప్రస్తుతం తీర్చిదిద్దే పని లో ఉన్నాడు. 

ఇక ఈ చిత్రంలో కంగనా రనౌత్ మరియు రాజ్ కుమార్ రావ్ జంటగా నటిస్తున్నారు, అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్  ఒక ముఖ్య పాత్ర లో నటించనున్నట్లు సమాచారం. అయితే షారుఖ్ పాత్ర నిడివి చాలా తక్కువగా ఉన్నట్లు సమాచారం. మరి తెలుగులో ఒక్క సక్సెస్ లేని ప్రకాష్ బాలీవుడ్ లో సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది ప్రశ్నర్ధకం. 


మరింత సమాచారం తెలుసుకోండి: