ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్ తో ఇండియాలో ఉన్న అన్ని సినిమా ఇండస్ట్రీలో టాలీవుడ్ ఇండస్ట్రీని ఆశ్చర్యకరంగా చూశాయి. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్లాప్ లో ఉన్న చాలామంది హీరోలు..టాలీవుడ్ ఇండస్ట్రీ లో హిట్ అయిన సినిమాలను రీమేక్ చేసి కెరీర్ లో బౌన్స్ అయిన వారు చాలామంది ఉన్నారు.

Related image

దీంతో ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది టెక్నీషియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోల పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఇదే క్రమంలో బాలీవుడ్ ప్రేక్షకులు కూడా నార్త్ లో ఉన్న మాస్ హీరోల సినిమాలను యూట్యూబ్ ఛానల్ లో చూస్తూ అభిమానులుగా కూడా ప్రస్తుతం మారుతున్నారు. ఇటువంటి క్రమంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న కొంత మంది టెక్నీషియన్స్ టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పై కన్నేసినట్లు...మనవడితో ఒక మంచి మాస్ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో చేపిస్తే కచ్చితంగా క్లిక్ అవుతుందనే ఆలోచనలో ఉన్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది.

Image result for allu arjun

అయితే ఇదే క్రమంలో కొత్తదనం కోరుకునే అల్లు అర్జున్ కూడా బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి కథలు వినిపించడానికి వస్తున్నా వారికి రెడ్ కార్పెట్ పరిస్థితి ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది దర్శకనిర్మాతలతో కూడా టచ్ లో ఉన్నాడట బన్నీ. ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: