విజయ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘డియర్ కామ్రేడ్’ మూవీ ఈ సమ్మర్ రేస్ నుండి తప్పుకోవడం అతడి అభిమానులకు నచ్చకపోయినా విజయ్ తీసుకున్న నిర్ణయంతో రాజీ పడిపోతున్నారు. వాస్తవానికి ‘డియర్ కామ్రేడ్’ మూవీ మే  31కి రిలీజ్ కు రెడీ అయినా అదేరోజు తమిళ తెలుగు భాషలలో రిలీజ్ కాబోతున్న హీరో సూర్య ‘ఎన్ జి కె’ మూవీకి భయపడి ‘డియర్ కామ్రేడ్’ వెనక్కి  తగ్గింది.

వాస్తవానికి సూర్య క్రేజ్ చెప్పుకోతగ్గ స్థాయిలో లేకపోయినా ఇప్పటికీ సూర్యకు తమిళనాడులో లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఇలాంటి పరిస్థుతులలో సూర్యతో పోటీ విజయ్ తనకు మంచిది కాదు అని అభిప్రాయ పడుతున్నాడు. 

దీనితో విజయ్ పక్కకు జరిగిన డేట్ ను హీరో రామ్ ఆక్రమించుకున్నాడు. పూరీ జగన్నాథ్ రామ్ కాంబినేషన్ లో రూపొందిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ ఈనెల 31న విడుదల అవుతూ సమ్మర్ రేస్ కు ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతోంది. పూరీ రామ్ ల కెరియర్ లకు సంబంధించి చాల కీలకంగా మారిన సినిమా కావడంతో ఈసినిమాను సమ్మర్ రేస్ కు విడుదల చేస్తే ఓపెనింగ్ కలక్షన్స్ విషయంలో మంచి జరుగుతుందని పూరి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

దీనికితోడు సూర్య సినిమాలకు తెలుగు ప్రేక్షకులలో పెద్దగా క్రేజ్ లేకపోవడం కూడ ఇలా పూరీ రామ్ ల చేత ఈ సాహసం చేయిస్తోంది అనుకోవాలి. అయితే విజయ్ దేవరకొండ చేయలేని సాహసం రామ్ చేసి విజయం సాదిస్తే ఒక మంచి అవకాశాన్ని వాడులున్నాను అని విజయ్ ఆతరువాత ఫీల్ అయ్యే ఆస్కారం ఉంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: