చిరంజీవి హీరోగా నటిస్తున్న సైరా సినిమా సెట్లో శుక్రవారం తెల్లవారు జామున అగ్నిప్రమాదం జరిగింది. కోకాపేటలోని అరవింద్ సొంత ఫాం-హౌజ్‌లో వేసిన సైరా సెట్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సెట్ దాదాపుగా కాలిపోయింది. దీంతో సుమారు ₹ 2 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. సైరా సెట్లో అగ్నిప్రమాదం సంభవించిన సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించింది. అయితే అంతగా ఫలితం లభించలేదు. కొన్ని రోజులు గా ఇక్కడే సినిమాకు సంబంధించిన కీలక ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు. గురువారం రాత్రి వరకూ చిత్ర బృందం షూటింగ్ జరిపింది.
*హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన అగ్నిప్రమాదంలో మనం సెట్ తో పాటు సైరాకు సంబంధించిన సెట్ కూడా కాలిపోయింది. దీంతో షూటింగ్‌కు కొంత కాలం ఆటంకం ఎదురైంది.
*ఆ తర్వాత శేరిలింగం పల్లిలో వేసిన సెట్‌ను ప్రభుత్వ అధికారులు కూల్చి వేశారు.అనుమతి లేకుండా ప్రభుత్వ భూమి లో సెట్ వేశారనే కారణంతో ప్రభుత్వ అధికారులు సెట్‌ను తొలగించారు. ఈ కారణంగానూ సైరా షూటింగ్ ఆగిపోయింది.
*తాజాగా కోకాపేట లోని చిరంజీవి సొంత ఫాం-హౌజ్‌లో వేసిన సైరా సెట్ లో ఈ ప్రమాదం చోటు చేసుకొగా సెట్ దాదాపుగా కాలిపోయింది. దీంతో షూటింగ్‌కు కొంతకాలం ఆటంకం ఎర్పడవచ్చు.
మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్ తో స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం ప్రత్యేకంగా వేసిన సెట్లో జరుగుతోంది. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.
ఈ సెట్ లో శుక్రవారం తెల్లవారుజామున అగ్రి ప్రమాదం జరిగింది.సైరా.. నరసింహారెడ్డి చిత్రం తెరకెక్కుతోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ బయోపిక్ రూపొందుతోంది. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ స్వయంగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు. చిరు డ్రీమ్ ప్రాజెక్ట్ కావటంతో ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా అతిభారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు మెగా కుటుంబం.
ఇందులో చిరు సరసన నయనతార నటిస్తుండగా.. అమితాబ్, విజయ్ సేతుపతి, తమన్నా, జగపతిబాబు, సుదీప్ సహా పలువురు ప్రముఖ నటులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.