దాదాపు చాలా కాలంగా హిట్ అనే పదాన్ని మర్చిపోయిన నటుడు మంచు విష్ణు, దీంతో కొంత కాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక గతంలో తాను నటించిన "సలీమ్" చిత్ర వివాదం ఇంకా మంచు ఫ్యామిలీని వదలక ముందే తాజాగా మరో వివాదం విష్ణుకి కొత్త తలకాయనొప్పిని తెచ్చిపెడుతోంది.  

అదేంటంటే  ఎప్పుడో విడుదల అవ్వాల్సిన మంచు విష్ణు చిత్రం "ఓటర్ " ఇంతవరకు విడుదల కాక పోగా ఈ చిత్ర దర్శకుడితో విష్ణుకి గొడవలు జరిగినట్లు తెలుస్తోంది .. ఈ చిత్ర దర్శకుడు కార్తీక్ ని నటుడు విష్ణు కోటిన్నర రూపాయలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. "ఓటర్ " పూర్తిగా రాజకీయ నేపధ్యం ఉన్న సినిమా కావడంతో మోహన్ బాబు సూపర్ హిట్ చిత్రమైన "అసెంబ్లీ రౌడీ" చిత్ర స్క్రీన్ ప్లే ను దర్శకుడు "ఓటర్" చిత్రానికి వాడుకున్నాడుట. "అసెంబ్లీ రౌడీ" తమ సొంత సినిమా అవడం, దర్శకుడు తమ సినిమా స్క్రీన్ ప్లే ని వాడుకోవడంతో విష్ణు కోటిన్నర ఇవ్వమని దర్సకుడిని అడుగుతున్నాడట, అయితే దీనికి దర్శకుడు ససేమిరా అనడంతో వివాదం మొదలయ్యింది. 

ఇదిలా ఉండగా ఈ చిత్ర దర్శకుడు కార్తీక్ వెర్షన్ వేరేలా ఉంది. "ఓటర్" కథకు "అసెంబ్లీ రౌడీ" స్క్రీన్ ప్లే వాడితే చాలా బాగుంటుందని చెప్పిందే విష్ణు అని, ఇందుకోసం కథ, స్క్రీన్ ప్లే క్రెడిట్స్ కూడా తనకే ఇమ్మని విష్ణు కోరాడని చెప్తున్నాడు. అసలుకే సినిమా విడుదలలో భారీ జాప్యం ఉండడంతో ఈ సినిమాపై ఎవరికీ కనీస అంచనాలు కూడా లేవు, తాజాగా ఈ కొత్త వివాదంతో అసలు "ఓటర్" సినిమా విడుదల అవుతుందా? లేదా? అనేది ప్రశ్నార్ధకమే. 


మరింత సమాచారం తెలుసుకోండి: