మెగా హీరోల్లో రొటీన్ కు భిన్నంగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్న వరుణ్ తేజ్ అంతరిక్షంతో ప్రయోగం చేసి ఆ తర్వాత ఎఫ్-2 అంటూ ఓ ఫ్యామిలీ మూవీ చేశాడు. ఆ రెండు సినిమాలకు చాలా వేరియేషన్ ఉంది. అలానే కెరియర్ తన ప్రతి సినిమాను కొత్తగా ట్రై చేస్తున్నాడు వరుణ్ తేజ్. ప్రస్తుతం వరుణ్ తేజ్ వాల్మికి సినిమా చేస్తున్నాడని తెలిసిందే.


తమిళ సూపర్ హిట్ సినిమా జిగుర్తండా రీమేక్ గా వస్తున్న ఈ సినిమాను హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ నెగటివ్ రోల్ లో నటిస్తున్నాడని తెలిసిందే. సినిమాలో మరో హీరోగా అధర్వ నటిస్తున్నాడు. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. ఈ మూవీలో వరుణ్ తేజ్ లుక్ ఒకటి లీకైంది.


బాగా గడ్డం, జుట్టు పెంచుకుని డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు వరుణ్ తేజ్. ముకుంద నుండి ఎఫ్-2 వరకు ప్రతి సినిమాలో కొత్తగా కనిపించాలని ప్రయత్నిస్తున్న వారుణ్ తేజ్ అందుకు తగినట్టుగానే మెగా ఫ్యాన్స్ లో సెపరేట్ ఇమేజ్ ఏర్పరచుకున్నాడు. దాదాపు ఓ క్రికెట్ టీం కు సరిపడే హీరోలు ఉన్న మెగా ఫ్యామిలీలో వరుణ్ తేజ్ మాత్రం డిఫరెంట్ స్టోరీస్ చేస్తున్నాడు.  


వాల్మికి తర్వాత నూతన దర్శకుడు కిరణ్ డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు వరుణ్ తేజ్. ఆ సినిమాలో బాక్సర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. బాక్సింగ్ నేపథ్యంలో సినిమా కాబట్టి ఈమధ్యనే వరుణ్ తేజ్ యూఎస్ లో స్పెషల్ బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకుని వచ్చాడు. చూస్తుంటే అందరి మెగా హీరోల కన్నా వరుణ్ తేజ్ సరికొత్త ట్రెండ్ సృష్టించేలా ఉన్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: