సూప‌ర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన మహర్షి ట్రైల‌ర్ రికార్డుల మీద రికార్డులు బ‌ద్ద‌లు కొడుతూ వ్యూస్ రాబ‌ట్టుకుంటోంది. మహేష్ కెరీర్లో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన 25వ సినిమాగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను పీవీపీ, అశ్వ‌నీద‌త్‌, దిల్ రాజు లాంటి అగ్ర‌నిర్మాత‌లు రూపొందిస్తున్నారు. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా ఈ నెల 9న థియేట‌ర్ల‌లోకి వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే.


ఇక ఇటీవ‌ల రిలీజ్ అయిన మ‌హ‌ర్షి ట్రైల‌ర్ విడుద‌ల అయిన 24 గంట‌ల్లోనే ఏకంగా 8 మిలియ‌న్ల వ్యూస్‌తో యూట్యూబ్ ట్రాప్ ట్రెండింగ్‌లో ఉంది. కేవ‌లం తెలుగు ప్రేక్ష‌కుల‌కే కాకుండా కన్నడ, ఇతర సౌతిండియన్ ప్రేక్షకులు సైతం ఈ ట్రైలర్‌ను చూసి ప్ర‌శంసిస్తున్నారు. కేవ‌లం 24 గంట‌ల్లో 8 మిలియ‌న్ల రియ‌ల్ టైం వ్య‌స్ అంటే ఇది నాన్ బాహుబ‌లి రికార్డు. మ‌హ‌ర్షి ట్రైల‌ర్ దెబ్బ‌కు నాన్ బాహుబ‌లి రికార్డులు అన్ని బ‌ద్ద‌లువుత‌న్నాయి.


ఇదే క్ర‌మంలో మ‌హ‌ర్షి ఎన్టీఆర్ అర‌వింద స‌మేత ట్రైల‌ర్ రికార్డును కూడా బ్రేక్ చేసింది. ఇప్పటి వరకు నాన్ బాహుబలి కేటగిరీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అరవింద సమేత ట్రైలర్ 6.9 మిలియన్ యూట్యూబ్‌ వ్యూస్‌తో నెం.1 స్థానంలో ఉంది. ఇప్పుడు ఆ రికార్డును మ‌హ‌ర్షి బ‌ద్ద‌లు కొట్టింది. అయితే లైక్స్ విష‌యంలో మాత్రం అర‌వింద స‌మేతే ముందు ఉంది. 24 గంట‌ల్లో ఆ సినిమా ట్రైల‌ర్‌కు 3 ల‌క్ష‌ల లైక్స్ రాగా... మ‌హ‌ర్షికి కేవ‌లం 2 ల‌క్ష‌ల లైక్స్ మాత్ర‌మే వ‌చ్చాయి. ఏదేమైనా మ‌హ‌ర్షికి ట్రైల‌ర్‌తో మాంచి  ఊపు వ‌చ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: