ఈ మద్య టాలీవుడ్ లో కొన్ని సినిమాలు చూస్తుంటే..కుటుంబ సభ్యులు అంతా కలిసి థియేటర్లో సినిమా చూస్తామా అన్న అనుమానాలు కలుగుతుగున్నాయి. పచ్చిగా రొమాన్స్...అర్థనగ్న ప్రదర్శన, బాత్ రూమ్, బీచ్ సీన్లు ఇలా ఓ హీరో, హీరోయిన్ ఇంత ఘోరంగా ఉంటారా అన్న బ్రమలు కలిగించేలా సినిమాలు తీస్తున్నారు.  ఏమన్నా అంటే నిత్యం మన సొసైటీలో ఇలాంటి రొమాన్స్ కామన్ అంటారు దర్శక, నిర్మాతలు.  ఆ మద్య అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 తో పాటు ఈ మద్య కొన్ని సినిమాలు మరీ దారుణంగా రొమాన్స్, లిప్ లాక్ సీన్లు చూపించారు. 
బట్టలిప్పి అమ్మాయిలను చూపించినా సినిమాలో విషయం ఉంటేనే ఆడుతుంది
ఇటీవల ఐదు చాపల కథ సినిమా అయితే ఏకంగా అర్థనగ్న ప్రదర్శనే చేశారు.  తాజాగా వరుణ్, దివ్యా రావు హీరో హీరోయిన్లుగా నరసింహ నంది దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'డిగ్రీ కాలేజ్' రిలీజ్ చేశారు.  ఈ ట్రైలర్ చూస్తుంటే అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 మరికొన్ని బూతు సినిమాలు మిక్స్ డ్ చేసి తీసినట్లు కనిపిస్తుంది. కథ, కథనం సంగతి పక్కనబెడితే..పోలీసుల చేతుల్లో యువకుల తన్నులు..భయంకరమైన రొమాన్స్, ముద్దులు, బహిరంగా శృంగారం ఇలా ట్రైలర్ మొత్తం బ్లూ ఫిలిమ్ లా ఉందని అంటున్నారు ఆడియన్స్. 

ఇదే అభిప్రాయాన్ని ఈ ట్రైలర్ చూసిన తర్వాత  సెన్సార్ బోర్డ్ మెంబర్‌ జీవత సైతం చిత్ర యూనిట్ పై పరోక్షంగా సీరియస్ అయినట్లే అనిపిస్తుంది.  ట్రైలర్ రిలీజ్ చేసిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ...అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 సినిమాల పుణ్యమా అని లిప్ లాక్ లేకుండా తెలుగు సినిమా లేదు అనే విధంగా పరిస్థితి దిగజారిపోయిందని ఫీలవుతున్నాను  అని జీవిత వ్యాఖ్యానించారు.  ఈ సినిమాలో కొన్ని అభ్యంతరక సీన్లు ఉన్నాయని..ఉదాహరణకు మనం ఇల్లు కట్టుకుంటే బాత్రైంలోనే స్నానం చేస్తాం, బెడ్రూంలోనే పడుకుంటాం.

హాలులో కూర్చుంటాం. హాలులో వచ్చి స్నానం చేయం. ప్రతి మనిషి జీవితంలో శృంగారం ఉంటుంది, సెక్స్ ఉంటుంది... అన్నీ ఉంటాయి. అవి ఎక్కడ చేయాలో అక్కడ చేస్తేనే బావుంటుంది. పబ్లిగ్గా రోడ్డు మీద చేస్తే చాలా అసహ్యంగా ఉంటుంది జీవిత పరోక్షంగా చిత్ర యూనిట్ కి ఓ వార్నింగ్ మెసేజ్ ఇచ్చినట్లే అనిపించింది.  మొత్తానికి ఇలాంటి ట్రైలర్స్ వల్ల యూత్ ని ఆకర్షించవొచ్చేమో కానీ..కామన్ ఆడియన్స్ ని కాదని ఆమె అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: