నాగ‌చైత‌న్య కెరీర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమా మ‌జిలీ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి నెల రోజులు అవుతోంది. చైతు కెరీర్‌లో వ‌సూళ్ల ప‌రంగా తిరుగులేని బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా 28 రోజుల‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ 30.07 కోట్ల థియేట్రిక‌ల్ షేర్ రాబ‌ట్టింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ 38.52 కోట్ల షేర్ కొల్ల‌గొట్టింది. ఇక మ‌జిలీ గ్రాస్ క‌లెక్ష‌న్స్ రూ. 68 కోట్లుగా ఉన్నాయి. మ‌జిలీ చైతు కెరీర్‌లోనే అత్య‌ధిక గ్రాస్‌, షేర్ వ‌సూళ్లు సాధించిన సినిమాగా రికార్డుల‌కు ఎక్కింది.


ఇక మ‌జిలీ వ‌చ్చాక చిత్ర‌ల‌హ‌రి, జెర్సీ, కాంచ‌న 3తో పాటు అవెంజ‌ర్స్ థియేట‌ర్ల‌లోకి దిగాయి. ఈ నాలుగు సినిమాలు ప‌ర్వాలేద‌నిపించుకున్నాయి. జెర్సీ, కాంచ‌న 3, అవెంజ‌ర్స్ విధ్వంసాన్ని క్రియేట్ చేస్తున్నా మ‌జిలీ మాత్రం నిల‌క‌డ‌గా వ‌సూళ్లు రాబ‌డుతోంది. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు చైతుకు కెరీర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ షేర్ రూ.25 కోట్లు... ఇప్పుడు మ‌జిలీ ఏకంగా రూ.40 కోట్ల షేర్ రాబ‌ట్ట‌డం అంటే మామూలు విష‌యం కాదు. ఇక ఇదే ఊపులో చైతు - స‌మంత క‌లిసి మ‌రో సినిమాలో జోడీ క‌ట్టే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ్‌. 


ప్రపంచవ్యాప్తంగా 'మజిలీ' 28 రోజుల కలెక్షన్స్: (రూ.కోట్ల‌లో)....
నైజామ్ - 13.02
సీడెడ్ - 4.48  
ఉత్తరాంధ్ర - 4.52 
కృష్ణ - 1.85 
గుంటూరు - 2.08 
ఈస్ట్ - 1.82  
వెస్ట్ -1.38 
నెల్లూరు -  0.92 
-------------------------------------------
ఎపీ + తెలంగాణా = రూ.30.07 కోట్లు
-------------------------------------------
కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా: 4.40 
ఓవర్సీస్: 4.05 
వరల్డ్ వైడ్ టోటల్ షేర్ - రూ.38.52 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్ గ్రాస్ - రూ. 68.05 కోట్లు


మరింత సమాచారం తెలుసుకోండి: