నాగచైతన్య కెరియర్ లో మొట్టమొదటి 40 కోట్ల సినిమాగా ‘మజిలీ’ మారబోతోంది అన్న స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ఈమూవీ విడుదలై మరో రెండు రోజులలో 30 రోజులు పూర్తి అవుతున్న నేపధ్యంలో ఈమూవీ ఇప్పటి వరకు 38 కోట్లు వసూలు చేసిందనీ ఈ వీకెండ్ కు ఈమూవీ 40 కోట్ల సినిమాగా మారడం ఖాయం అని అంటున్నారు.

ఇప్పటి వరకు నాగచైతన్య నటించిన సినిమాలలో అత్యధిక నెట్ కలక్షన్స్ తెచ్చుకున్న ‘ప్రేమమ్’ మూవీ 22 కోట్లు కలక్షన్స్ తెచ్చుకుంటే ఆ కలక్షన్స్ రికార్డులను దాటిపోయి చైతన్యను 40 కోట్ల హీరోగా మార్చిన ‘మజిలీ’ అతడి కెరియర్ లో బెస్ట్ మూవీగా మారిపోయింది. అయితే చైతూ ‘మజిలీ’ కంటే నాని ‘జెర్సీ’ కి విపరీతమైన ప్రశంసలు లభించడంతో పాటు టోటల్ పాజిటివ్ టాక్ మొదటిరోజు మొదటి షో నుండి వచ్చినా ఇప్పటి వరకు ‘జెర్సీ’ మూవీకి 28 కోట్ల నెట్ కలక్షన్స్ వచ్చాయని ఈమూవీ టోటల్ రన్ పూర్తి చేసుకునే సరికి 35 కోట్ల మార్క్ ను దాటడం కష్టం అని అంటున్నారు. 

అయితే ‘జెర్సీ’ మూవీకి ఇలాంటి పరిస్థితి ఏర్పడటం వెనుక ఈమూవీలో కామెడీ తక్కువ కావడం అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ‘జెర్సీ’ తో పోల్చుకుంటే ‘మజిలీ’ మూవీలో కామెడీ సీన్స్ ఎక్కువగా ఉండటంతో ఆమూవీని సామాన్య ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అన్న కామెంట్స్ వస్తున్నాయి. 

అయితే  ‘జెర్సీ’ కలక్షన్స్ ఆసినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్ స్థాయిలో లేకపోయినా ఆమూవీ రీమేక్ రేట్స్ కోసం బాలీవుడ్ తో పాటు కన్నడ ఫిలిం ఇండస్ట్రీ నుండి విపరీతమైన ఫ్యాన్సీ ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం. దీనితో ప్రశంసల విషయంలో ‘జెర్సీ’ ‘మజిలీ’ కన్నా చాల ముందు స్థానంలో ఉంటే నెట్ కలక్షన్స్ విషయంలో ‘మజిలీ’ జెర్సీ కన్నా ముందు స్థానంలో కొనసాగుతూ ఉండటం నానీకి షాక్ అయితే చైతూకు జోష్ ను ఇచ్చే విషయంగా మారింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: