అక్కినేని ఫ్యామిలీ నుండి వెండితెరకు పరిచయమైన అక్కినేని అఖిల్ ఇప్పటి వరకు సరైన హిట్ కొట్టలేకపోయారు. గత కొంత కాలం నుండి సినిమాలు చేస్తున్నా సరైన హిట్టు అక్కినేని అఖిల్ కి బాక్సాఫీస్ దగ్గర పడలేదు. ఈ క్రమంలో తండ్రి నాగార్జున కొడుకు కెరియర్ కోసం హలో అనే సినిమా కు భారీగా పెట్టుబడి పెట్టడం కూడా జరిగింది. అయినా గాని ఆ సినిమా పెద్దగా ప్రేక్షకులను అలరించలేకపోయింది.

Image result for allu aravind nagarjuna akhil

దీంతో ప్రస్తుతం అక్కినేని అఖిల్ ని గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ చేతిలో పెట్టారు కింగ్ నాగార్జున. అక్కినేని అఖిల్ హీరోగా 'గీతాఆర్ట్స్ 2' బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించబోతున్నారు అల్లు అరవింద్. అయితే ఇప్పుడు ప్రాజెక్ట్ లో నాగార్జున కూడా పెట్టుబడి పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

Image result for allu aravind nagarjuna akhil

ప్రాజెక్ట్ పై నమ్మకంతో నాగ్ ఈ సినిమాపై డబ్బు పెట్టడం లేదు.. అసలు విషయమేమిటంటే.. అల్లు అరవింద్ ఈ సినిమా కోసం ఫిక్స్ చేసిన బడ్జెట్ కంటే ఇంకాస్త ఎక్కువ ఖర్చు అవుతుందట. అయితే అఖిల్ సినిమాపై అంత బడ్జెట్ పెట్టనని,ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించాలని అరవింద్ సూచించాడట.దీంతో నాగార్జున సీన్ లోకి ఎంటర్ అయితే మిగతా బడ్జెట్ను చూసుకుంటానని..నా కొడుకు కి మంచి హిట్టు పడాలని అల్లు అరవింద్ కి సూచించారట నాగార్జున.  

  



మరింత సమాచారం తెలుసుకోండి: