మన  “మెజారిటీ జనాలు చేసేది చెప్పరు చెప్పింది చెయ్యరు”  అందరు డబ్బు ముఖ్యం కాదని పైకి అంటూ ఉంటారు. కానీ డబ్బు కోసం మురుగు కాలువ పక్కన ఉన్న గడ్డిని కూడా ఇష్టంగా తింటారు. సమాజం అంతా అదో రకంగా ఉంటుంది కదూ! ఇలాంటి జనాల మధ్యలో బోల్ద్ గా బహిరంగంగా మనసులో ఉన్నది మాట్లాడడం చాలా కష్టం.  పొగరు అంటారు కొందరు బోల్డ్ అంటారు మరి కొందరు.   కన్నడ బ్యూటీ  శ్రద్ధా శ్రీనాథ్ వరస చూస్తుంటే ఆమె ఈ సమాజానికి సాధారణ జన ఆలోచనకు ప్రవర్తనకు వ్యతిరేకంగా బోల్డ్ గా మాట్లాడుతున్నట్లుంది. 
 
కొద్ది రోజుల క్రితం తెలుగు 'యూ- టర్న్' చూశారా? అని అడిగితే 'అరగంట కంటే ఎక్కువ చూడలేక ఆపేశాను' అని చెప్పి విన్నవారందరికీ షాక్! ఇచ్చింది.  సమంతా అందు నా అక్కినేని వారి కోడలు సినిమా గురించి అలా కామెంట్ చెయ్యడం ఏంటని? అసలు  ఆ ధైర్యమేమిటి? అని జనాలు చెవులు కొరుక్కున్నారు.  

ఈ ఎపిసోడ్ ను ఫ్రాంక్ గా చూస్తే, అందులో తప్పేముంది. ఒక సినిమా శ్రద్ధా శ్రీనాద్ కు నచ్చలేదు. నచ్చలేదని చెప్పింది. మనకు కావాల్సింది అది కాదు కాదా? 
యూ టర్న్ సూపర్! సమంతా సూపర్! అని చెప్పాలి.  అలా చెప్పకపోయేసరికి శ్రద్ధా ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అందుకే కొందరు శ్రద్ధ ను విమర్శించారు. అయితే శ్రద్ధ ఆ విమర్శలను అసలు పట్టించుకోలేదు. 
 
ఇదిలా ఉంటే తాజగా శ్రద్ధా మరింత బోల్డ్ కామెంట్స్ చేసింది. రీసెంట్ గా  శ్రద్ధ స్లీవ్ లెస్ టాప్ వేసుకొని జుట్టును సవరించుకుంటూ క్లిప్ పెట్టుకునే విడియో ను షేర్ చేసింది.  అలా సరి చేసుకుంటూ కొందరు తన అండర్ అర్మ్స్ ను ఇష్టపడతారని వాళ్ళు చూసుకోవచ్చని కామెంట్ చేసింది.  శివశివా! అని సంప్రదాయ వాదులు షాక్ కు గురి కావచ్చు. ఈ జెనరేషన్ జనాలు మాత్రం రౌడీ హీరో విజయ దేవరకొండకు లేడీ వెర్షన్ లాగా ఉందే అని ముచ్చట పడొచ్చు. రౌడీ హీరోయిన్! అనే ట్యాగ్ కూడా ప్రదానం చెయ్యొచ్చు.  ఎవరి రిసీవింగ్ ఫ్రీక్వెన్సీ వారిది!
 

మరింత సమాచారం తెలుసుకోండి: