దేశానికి ఒకనాడు ఆదర్శంగా స్పూర్తిగా టాలీవుడ్ ఉండేది. ఇక్కడ నుంచి ఎన్నో సినిమాలు ఇతర భాషల్లోకి వెళ్ళాయి. ఇక్కడ కళాకారులను మిగిలిన వారు గర్వంగా భావించేవారు. దేనికైనా మొదట ఇక్కడే అన్నట్లుగా నాటి చిత్రాల తీరు ఉండేది. దిగ్గజాలు అన్నీ ఒకే చోట అన్నట్లుగా టాలీవుడ్ గత వైభవం గొప్పగా కనిపించేది. మరి ఏదీ నాటి సిరులు అంటే సమాధానం ఉందా


దర్శకరత్న దాసరి నారాయణరావు రెండవ జయంతి  మే 4న తేదీన. ఆయన చనిపోయి అపుడే రెండేళ్ళు అవుతోంది. దాసరికి ఆయనే సరి అన్న మాట అక్షరాలా నిజమైంది. ఆయన భారీ కాయం మాదిరిగానే ఆయన కీర్తి కూడా చాలా పెద్దదే. దాన్ని ఎవరూ భర్తీ చేయలేకపోతున్నారు. దాసరి అంటే దర్శకుడు మాత్రమే కాదు బహుముఖ ప్రతిభాశాలి. అన్నిటికీ మించి మానవతామూర్తి. సినీ పరిశ్రమకు పెద్ద మేస్త్రి.


దాసరి ఇంటి తలుపులు అర్ధరాత్రి కూడా తెరచే ఉంటాయి. సినిమా రంగంలో కార్మికుడు అయినా చనువుగా ఆ తలుపులు తోసుకుని లోపలికి వెళ్ళిపోవచ్చు. తమ సమస్య చెప్పుకుని గట్టి భరోసా పొందవచ్చు. దాసరి పోయాక ఆ పరిస్థితి ఉందా అంటే కచ్చితంగా లేదు అన్న మాటే వినిపిస్తుంది. దాసరికి ఎంతో మంది శిష్యులు ఉన్నారు. ఆయన వల్ల నట జీవితాన్ని పండించుకున్న వారు కూడా ఉన్నారు. ఈ రెండేళ్ళలో ఒక్కరు కూడా దాసరి లేని కొరత కొంత కూడా తీర్చలేకపోయారు. 


అసలు దాసరి మాత్రమే కాదు. ఓ రామానాయుడు. ఓ అక్కినేని, ఓ నందమూరి, ఓ సావిత్రి, ఓ సూర్యాకాంతం, ఓ ఎస్వీయార్ ఓ ఘంటశాల, ఓ భానుమతి ఓ నాగిరెడ్డి, ఓ చక్రపాణి, ఓ పింగళి. ఓ వేటూరి ఇలా ఎంతో మంది ఈ లోకాన్ని విడిచిపోయారు, అది కాలధర్మం,  మరి వారి ప్లేస్ ని రిప్లేస్ చేయగలరా అంటే పెద్ద‌ డౌట్ వస్తుంది. మొత్తానికి  టాలీవుడ్ ఎన్నో కోల్పోయింది. కానీ కొంతైనా తిరిగి తెచ్చుకోలేకపోతోంది. అదే చిత్ర విచిత్రం మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: