ఏ హీరోకైనా సరే కరెక్ట్ సినిమా పడితే అప్పుడు అతని సత్తా ఏంటో తెలుస్తుంది. దీనికి పర్ఫెక్ట్ సాక్ష్యంగా అక్కినేని నాగ చైతన్య మజిలీ కలక్షన్స్ అని చెప్పొచ్చు. శివ నిర్వాణ డైరక్షన్ లో మీడియం బడ్జెట్ సినిమాగా వచ్చిన మజిలీ సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లింది. చైతు, సమంత, దివ్యాన్ష కౌశిక్ నటించిన ఈ సినిమాకు గోపి సుందర్ మ్యూజిక్ అందించగా తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిచారు.


23 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో వచ్చిన మజిలీ సినిమా మొదటి వారం లోనే ఆ మొత్తాన్ని రాబట్టింది. సినిమా కొన్న ప్రతి డిస్ట్రిబ్యూటర్ లాభాల పంట పండించిన సినిమా మజిలీ. నాగ చైతన్య, సమంత జోడీకి పెళ్లి తర్వాత కూడా క్రేజ్ ఎలా ఉంది అన్నది ఈ సినిమా నిరూపించింది. ఈ ఉత్సాహంతోనే అజయ్ భూపతి డైరక్షన్ లో నాగ చైతన్యతో పాటుగా సమంత కూడా నటించాలని చూస్తుంది. 


ఏరియావైజ్ గా మజిలీ 4 వారాల వసూళ్లు :


నైజాం : 12.54 కోట్లు 
సీడెడ్: 4.20 కోట్లు 
నెల్లూరు : 0.92 కోట్లు 
కృష్ణ: 1.82 కోట్లు 
గుంటూరు: 2.18 కోట్లు 
వైజాగ్: 4.27 కోట్లు 
ఈస్ట్: 1.74 కోట్లు 
వెస్ట్ : 1.36 కోట్లు 
ఏపీ/తెలంగణ : 29.03 కోట్లు 
రెస్ట్ ఆఫ్ ఇండియా : 3.50 కోట్లు 
ఓవర్సీస్ : 3.20 కోట్లు 
వరల్డ్ వైడ్ : 35.73 కోట్లు  


మరింత సమాచారం తెలుసుకోండి: