మాస్ మహరాజ్ రవితేజ ప్రస్తుతం చేస్తున్న డిస్కో రాజా మూవీ ఆగిపోతుందని వార్తలు వస్తున్నాయి. ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం సినిమాలతో దర్శకుడిగా ప్రతిభ చాటిన వి.ఐ ఆనంద్ రవితేజతో చేస్తున్న సినిమా డిస్కో రాజా. సినిమా ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని సెట్స్ మీదకు వెళ్లే టైంలో బ్యాడ్ లక్ మొదలైంది.


నిర్మాత ముందు అనుకున్న బడ్జెట్ ను మించి ఎస్టిమేషన్ వేశాడట దర్శకుడు వి.ఐ ఆనంద్. అయితే కాస్ట్ కటింగ్ కోసం స్టార్ హీరోయిన్స్ బదులుగా కొత్త వారిని.. సెట్స్ బదులుగా అవుట్ డోర్ షూటింగ్స్ కూడా ప్లాన్ చేశాడట. అయినా సరే బడ్జెట్ కంట్రోల్ అవకపోవడంతో సినిమాలో సాంగ్స్ కూడా తీసేయాలని అనుకున్నారట.


కంటెంట్ కు తగ్గ బడ్జెట్ ఎంతైనా పెట్టొచ్చు కాని రవితేజ మార్కెట్ ప్రస్తుతం ఏమంత బాగాలేదు. రెండేళ్లు గ్యాప్ ఇచ్చి రాజా ది గ్రేట్ హిట్ కొట్టినా ఆ తర్వాత వచ్చిన 3 సినిమాలు దారుణంగా పోయాయి. అందుకే మాస్ రాజా సినిమాపై నిర్మాతలు వెనుకడుగు వేస్తున్నారట. ఇంకొంతమంది డిస్కో రాజా సినిమా ఆగిపోయిందని కూడా ప్రచారం చేస్తున్నారు.


ఏది ఏమైనా మాస్ మహరాజ్ గా ప్రేక్షకులను పైసా వసూల్ ఎంటర్టైనర్ అందించే రవితేజ సినిమాకు ఇలా బడ్జెట్ కష్టాలు రావడం మాత్రం ఊహించలేం. మరి సినిమా ఉంటుందా లేదా తర్వాత అప్డేట్స్ ఏంటన్నది త్వరలో తెలుస్తుంది. ప్రస్తుతం రవితేజ చేతిలో ఉన్న సినిమా ఇది ఒక్కటే. 



మరింత సమాచారం తెలుసుకోండి: