అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌ దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టిస్తోందా.. రాజమౌళి బాహుబలి సినిమాను మించిన వసూళ్లు రాబడుతోందా..ఇప్పుడు  ఈ అంశం వివాదంగా మారుతోంది. 


అవెంజర్స్ మూవీ వసూళ్లను బాలీవుడ్ సినిమాలతో పోలుస్తూ సినీ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ పెట్టిన పోస్టు ఈ వివాదానికి దారి తీసింది. బాలీవుడ్‌లో తొలివారం వసూళ్లపరంగా ముందున్న ఐదు సినిమాలను ఆయన కంపేర్ చేస్తూ పోస్టు పెట్టారు. అందులో బాహుబలి 2 (రూ.247 కోట్లు-కేవలం హిందీ భాషలో), సుల్తాన్‌ (రూ.229.16 కోట్లు), టైగర్‌ జిందాహై (రూ.206.04 కోట్లు), సంజు (రూ.202.51 కోట్లు), దంగల్‌ (రూ.197.54 కోట్లు) రాబట్టాయని, అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌ రూ. 260.40 కోట్లతో వీటిని బీట్‌ తరణ్ ఆదర్శ్  ట్వీట్‌ చేశారు.

ఈ పోలికను బాహుబలి సినిమా నిర్మాత శోభూ యార్లగడ్డ స్పందించారు. అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌ అన్నీ భాషా వసూళ్లను , బాహుబలి 2 సినిమా హిందీ కలెక్షన్స్‌ మాత్రమే తీసుకోవడం సరికాదని బదులిచ్చారు. ప్రముఖ విశ్లేషకులైన మీరు ఈ కోణంలో విశ్లేషించడం సరికాదని తరణ్‌ కు చురకలు వేశారు శోభు. 

బాహుబలి 2 సినిమా తొలివారం అన్నీ వెర్షన్స్‌ కలెక్షన్స్‌ కలిపి దాదాపు 420 కోట్లు వసూలు చేసిందట. ఇండియాలో ఈ రికార్డు సాధించడం ఏ హాలీవుడ్‌ సినిమా వల్ల కూడా కాలేదని శంభు అంటున్నారు. శోభు యార్లగడ్డ వ్యాఖ్యలకు మద్దతు కూడా లభిస్తుంది. కచ్చితంగా శోభూ.. నేను మీ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాను అని బాహుబలి సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌ కుమార్‌ స్పందించారు. మరి తరణ్ ఆదర్శ్ ఎలా స్పందిస్తారో..



మరింత సమాచారం తెలుసుకోండి: