సౌత్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ గత కొంత కాలం నుండి వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఈ సంగతి అందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలో గతంలో తన కెరియర్ లో భారీ హిట్ అయినా భారతీయుడు సినిమా సీక్వెల్ ని కమల్ హాసన్ తో తీస్తున్న శంకర్ ఇటీవల గత కొంతకాలం నుండి కొన్ని అనివార్య కారణాల వలన షూటింగ్ ఆగిపోవడంతో శంకర్ ఓ భారీ మల్టీస్టారర్ సినిమా కి రాజమౌళి తరహాలో ప్లాన్ చేసినట్లు సమాచారం.

Image result for rajamouli

టాలీవుడ్ ఇండస్ట్రీ లో మాస్ హీరో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రామ్ చరణ్- జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి భారీ మల్టీస్టారర్ సినిమా చేస్తున్న సంగతి మనకందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ తో చేస్తున్న భారతీయుడు సినిమా షూటింగ్ మొదలవటానికి చాలా సమయం పట్టే అవకాశాలు ఉన్న క్రమంలో...రాజమౌళి తెరకెక్కిస్తున్న టైపులో డైరెక్టర్ శంకర్ ఒక డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ కి శ్రీకారం చుడుతున్నట్లు సమాచారం.

Image result for shankar

అందులో విజయ్ - విక్రమ్ నటించే అవకాశం ఉన్నట్లు టాక్. విజయ్ తో ఇదివరకే శంకర్ స్నేహితుడు (3 ఇడియట్స్ రీమేక్) చేశాడు. ఇక విక్రమ్ తో అపరిచితుడు - ఐ సినిమాలు చేశారు. మరి 200 కోట్ల మార్కెట్ ఉన్న ఈ ఇద్దరి స్టార్ హీరోలతో శంకర్ ఎలాంటి సినిమాను చేస్తాడో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: