ఒకానొక సమయంలో సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ క్రేజ్ మరియు మంచి మార్కెట్ ఏర్పర్చుకున్నాడు హీరో సిద్ధార్థ. బాయ్స్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సిద్ధార్థ అతి తక్కువ కాలంలోనే సౌత్ ఇండియా ప్రేక్షకుల హృదయాలను ఎంతగానో దోచుకున్నాడు. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో తమిళంలో మరియు చాలా ఇండస్ట్రీలలో ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో భారీ విజయాలు సాధించాడు.

Image result for siddhartha hero

అయితే గత కొంత కాలం నుండి సినిమాలకు దూరమైన హీరో సిద్ధార్థ సోషల్ మీడియాలో దర్శనమిచ్చాడు. రీసెంట్ గా సునీల్ తో కలిసి దిగిన ఒక సెల్ఫీని సిద్దార్థ్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. అయితే మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి వచ్చేదెప్పుడుని ఫాలోవర్స్ అడిగిన ప్రశ్నకు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. ఎవరేమనుకున్నా.. మళ్ళీ తెలుగు సినిమాతో తప్పకుండా అందరిని అలరిస్తాను.

Related image

ప్రస్తుతం చేతిలో కొన్ని కథలు ఉన్నాయి. 18 నెలలు టైమ్ ఇవ్వండి. తప్పకుండా ఒక మంచి సినిమాతో మీ ముందుంటాను. ప్రామిస్ చేస్తున్నా. మీ నమ్మకాన్ని వమ్ము చేయను. కష్టపడి మళ్ళీ మిమ్మల్ని మెప్పించేందుకు ప్రయత్నిస్తాను అని సిద్దార్థ్ వివరణ ఇచ్చాడు. దీంతో ఈ వార్త ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు సోషల్ మీడియాలో పెద్ద వైరల్ గా మారింది.   


మరింత సమాచారం తెలుసుకోండి: