ఈ ఏడాది సమ్మర్ రేసుకు రాబోతున్న అత్యంత భారీ చిత్రం ‘మహర్షి’ మూవీకి నిన్న సెన్సార్ కార్యక్రమం పూర్తి అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈసినిమాకు U/A సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ అధికారులు ఈమూవీ విషయంలో ఎటువంటి కట్స్ వేయకుండా క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

ఈమూవీకి సంబంధించిన క్లైమాక్స్ కు సంబంధించి ఒక కీలక విషయం లీక్ అయింది. ఈమూవీ క్లైమాక్స్ చూసిన తరువాత ప్రేక్షకులు చాల బరువెక్కిన గుండెలతో బయటకు వస్తారని ఎమోషనల్ గా సాగే క్లైమాక్స్ ఈమూవీ ప్రత్యేక ఆకర్షణ అని తెలుస్తోంది. అయితే ఇలాంటి క్లైమాక్స్ ఇప్పటి వరకు టాప్ హీరోల సినిమాలలో రాలేదని అంటున్నారు. 

దీనితో ఈసినిమాను వంశీ పైడిపల్లి ఒక మోస్తరుగా చివరి వరకు లాక్కుని వచ్చినా ఈమూవీ క్లైమాక్స్ బలంతో ‘మహర్షి’ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయం అని అంటున్నారు. ఇది ఇలా ఉంటే ఈసినిమాకు సంబంధించి విడుదల చేసిన పాటలలో రెండు మాత్రమే స్ట్రయిట్ సాంగ్స్ అయితే అందులో ఒకటి డ్యూయట్ మిగతావన్నీ మాంటేజ్ సాంగ్స్ అన్న విషయం తెలిసిందే. 

అయితే ఈసినిమాలో ఇప్పటి వరకు విడుదల చేయని మరొక పాట ఉంది అన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈపాట డ్యూయట్ సాంగ్ కాదు అది కూడ మాంటేజ్ సాంగ్ అంటున్నారు. అది కేవలం సినిమాలో చూసి ఎంజాయ్ చేయాలంటున్నాడు వంశీ పైడిపల్లి. ఆ పాట వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయని వంశీ పైడిపల్లి జోస్యం చెపుతున్నాడు. దీనితో ఈపాటను ఎందుకు అంత రహస్యంగా ఇప్పటి వరకు ఉంచారు అన్న సందేహాలు కలుగుతున్నాయి. ‘మహర్షి’ ఆడియో క్లిక్ కాని నేపధ్యంలో ఒక మంచి పాటను ఈమూవీ దర్శక నిర్మాతలు ఎందుకు రహస్యంగా దాచారు అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న.. 


మరింత సమాచారం తెలుసుకోండి: