అఖిల్ నాల్గవ సినిమా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మాణంలో ఫైనల్ అయినా ఆమూవీకి సంబంధించి ఇంక అధికారిక ప్రారంభోత్సవం జరగకపోవడానికి నాగార్జున అరవింద్ ల మధ్య ఆర్ధిక లావాదీవిల రాజీలో ఆలస్యం జరగడం అని అంటున్నారు. ఈమూవీ చిత్ర నిర్మాణంలో ప్రస్తుతం అఖిల్ కు ఉన్న మార్కెట్ రీత్యా ఎక్కువ ఖర్చు పెట్టడానికి అల్లు అరవింద్ వెనకడుగు వేస్తున్నట్లు టాక్. 

అయితే ఈమూవీకి సంబంధించిన కథ రీత్యా బడ్జెట్ విషయంలో వెనకడుగు వేస్తే ఈమూవీ క్వాలిటీ దెబ్బ తింటుందని నాగార్జున అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. దీనితో ఈసినిమాకు పేరుకు నిర్మాత అరవింద్ అయినా ఈమూవీ ఫైనాన్స్ విషయంలో నాగార్జున అరవింద్ కు అన్ని విధాల సహాయపడుతూ తెరవెనుక ఈమూవీకి ఘోస్ట్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించడానికి తన అంగీకారం తెలియచేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

వాస్తవానికి ఈ సినిమాను కూడ నిర్మించగల సత్తా నాగార్జునకు ఉన్నా అఖిల్ సినిమాలు అన్నీ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై వస్తే అఖిల్ వైపు బయట నిర్మాతలు చూడటం లేదు అని కామెంట్స్ వస్తాయి కాబట్టి ఇలా పరోక్షంగా నాగ్ అరవింద్ ద్వారా ఈమూవీకి సహాయపడుతున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. దీనికితోడు సినిమా నిర్మాణంలో దర్శకుడు నుండి మంచి అవుట్ పుట్ రాబట్టడంలో అరవింద్ కు మంచి పేరు ఉన్న నేపధ్యంలో నాగార్జున ఈ మూవీకి నిర్మాతగా అన్ని విధాల అరవింద్ సరిపోతాడు అని భావించి బలవంత పెట్టి ఒప్పించినట్లు టాక్. 

సాధారణంగా ఒక యంగ్ హీరోకు వరసగా మూడు పరాజయాలు వస్తే ఇక ఆ యంగ్ హీరో వంక ఎవరు చూడరు. అయితే అఖిల్ కు ఉన్న బ్యాక్ గ్రౌండ్ రీత్యా అతడు ఇంకా రేస్ లో కొనసాగుతూనే ఉన్నాడు. సినిమాలలోకి రాక ముందు యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న అఖిల్ సినిమాలలోకి వచ్చాక ఆ క్రేజ్ ను చాల వరకు కోల్పోవడం అత్యంత దురదృష్టకరం..


మరింత సమాచారం తెలుసుకోండి: