నిర్మాత రామ్ తాళ్ళూరి పవన్ కళ్యాణ్ ల మధ్య మంచి స్నేహం ఉంది. ‘జనసేన’ కు ఇతడు అన్నివిధాల సపోర్ట్ ఇవ్వడమే కాకుండా ఈమధ్యన జరిగిన ఎన్నికలలో నిధుల కొరతతో సతమతమవుతున్న ‘జనసేన’ కు ఆర్ధికంగా రామ్ తాళ్ళూరి చేయూత ఇచ్చాడు అన్న వార్తలు కూడ వినిపించాయి. 

అయితే నిర్మాతగా మారిన రామ్ తాళ్ళూరికి పరాజయాలు పలకరిస్తూ ఉండటంతో పాటు ప్రస్తుతం అతడు రవితేజాతో దర్శకుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో మొదలు పెట్టిన ‘డిస్కో రాజా’ మూవీ మధ్యలో ఆగిపోవడంతో రామ్ తాళ్ళూరి మరింత టెన్షన్ పడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం మాస్ మహారాజ సినిమాలకు మార్కెట్ లేని నేపధ్యంలో ఈ సినిమా బడ్జెట్ లో పదికోట్లు కోత పెట్టడం రవితేజాకు తీవ్ర అసహనాన్ని కలిగించి ఆసినిమా షూటింగ్ ను మధ్యలో ఆపివేసాడు.

దీనితో ఈమూవీ పరిస్థితో పాటు తన ఆర్ధిక పరిస్థితులు అయోమయంలో పడిపోవడంతో కొద్దిరోజుల క్రితం రామ్ తాళ్ళూరి పవన్ ను కలిసి ఆగిపోయిన తన మూవీ ప్రాజెక్ట్ విషయంలో పవన్ సహాయం కోరినట్లు సమాచారం. ఈమూవీ బడ్జెట్ ను ఎందుకు తగ్గించ వలసి వచ్చిందో రవితేజాకు వివరించడంలో పవన్ సహకారాన్ని రామ్ తాళ్లూరి కోరినట్లు టాక్.

జరిగిన విషయాలు తెలుసుకున్న పవన్ వెంటనే రంగంలోకి దిగి అలకమీద ఉన్న రవితేజాను ఒప్పించడానికి తనవంతు రాయబారాలు ఇప్పటికే మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఎన్నికల ఫలితాలు వచ్చాక వీలుచూసుకుని ఈ ఏడాది చివరిలోపే తాను రామ్ తాళ్ళూరికి ఒక సినిమాను చేసిపెడతాను అని వాగ్దానం ఇవ్వడమే కాకుండా తనకు ఒక మంచి కథ వినిపించగల దర్శకుడి కోసం అన్వేషణ చేయమని చెప్పడమే కాకుండా రామ్ తాళ్ళూరి సమస్యలు అన్నీ తాను పరిష్కరిస్తానని ఏమాత్రం అధైర్యపడవద్దు అని భరోసా ఇచ్చినట్లు ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రిక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది..  


మరింత సమాచారం తెలుసుకోండి: