ప్రిన్స్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా మీద ఇప్పటికే ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి. అయితే మహేష్ బాబు సమ్మర్ సెన్సేషన్ మహర్షి మూవీ సెన్సార్ ఫార్మాలిటీ పూర్తి చేసుకుంది. 9న విడుదలకు సిద్దమైంది. వితవుట్ కట్ యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది. రెండు గంటల 48 నిమిషాల మేరకు నిడివి వచ్చినట్లు తెలుస్తోంది. మహర్షి సినిమాను పెద్దఎత్తున విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి.


ఈ సమ్మర్ కు ఇదే పెద్ద సినిమా. దాదాపు పదిహేను వందల స్క్రీన్లకు పైనే వుండే అవకాశం వుంది. సినిమా థియేటర్ హక్కులు వందకోట్ల వరకు మార్కెట్ చేసారు. చాలా ఏరియాల్లో టికెట్ల ధరలు 250 నుంచి 150 మధ్యన నిర్ణయించారు. బహుశా అయిదు షోలు వేసే అవకాశం కూడా వుందని తెలుస్తోంది. చాలా చోట్ల ఫిక్స్ డ్ హయ్యర్లు, థియేటర్ల వారీ అమ్మకాలు షురూ అయ్యాయి. వీటికి కూడా కాస్త భారీ రేట్లే పలుకుతున్నాయి.


మొత్తంమీద ఫస్ట్ డే రికార్డు కోసం ప్రయత్నాలు అయితే జరుగుతాయి. భరత్ అనే నేను ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో 22 కోట్ల వరకు వసూళ్లు సాధించింది. మహర్షి దానిని అధిగమిస్తుందనే ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. రెండు వారాలు ముందుగా థియేటర్లలో సరైన సినిమా లేకపోవడం, పీక్ సమ్మర్ సీజన్ లో విడుదల కావడం మహర్షికి అడ్వాంటేజ్ లు. అదే విధంగా విడుదలయిన మలివారం షెడ్యూలు అయిన మీడియం సినిమాల విడుదల కూడా ఇంకా కాస్త అనుమానంగానే వుంది. అందువల్ల మహర్షి బాక్సాఫీస్ లెక్కలు మాత్రం కాస్త భారీగానే వుండే అవకాశం వుంది

మరింత సమాచారం తెలుసుకోండి: