‘మహర్షి’ మూవీలో జయసుధ మహేష్ కు తల్లిగా నటిస్తోంది. ఈమూవీకి సంబంధించి ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జయసుధ మెగా హీరోలను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ మెగా ఫ్యామిలీకి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నట్లు టాక్. జయసుధతో ఇంటర్వ్యూను నిర్వహిస్తున్న మీడియా సంస్థ ప్రతినిధి మహేష్ బాబుకు మెగా హీరోలకు తేడా ఏమిటి అని ప్రశ్నించినప్పుడు జయసుధ తన ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తూ మెగా హీరోలు అంటే ఎవరు అని షాకింగ్ రిప్లయ్ ఇచ్చింది. 

మెగా హీరోలు అన్నపదం ఆ హీరోల అభిమానులు లేదంటే మీడియా సృష్టించిన పదం అని అంటూ షూటింగ్ స్పాట్ లో తాను నటిస్తున్నప్పుడు తనతో కలిసి నటిస్తున్న నటుడు మెగా హీరోనా లేకుంటే మామూలు హీరోనా అన్న విషయాలు తాను అసలు పట్టించుకోనని షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాదు తనతో కలిసి నటించే ఎంతటి గొప్ప వ్యక్తి అయినా తన కో ఆర్టిస్ట్ మాత్రమే అని భావిస్తానని జయసుధ చేసిన కామెంట్స్ మెగా అభిమానుల మధ్య షాకింగ్ న్యూస్ గా మారింది. 

అంతేకాదు తన దృష్టిలో మెగా హీరోలు అంటే ఎన్టీఆర్ ఎఎన్ఆర్ లు మాత్రమే అనీ వారి రేంజ్ ఉన్న హీరోలు ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరు లేరు అన్న అర్ధం వచ్చేలా జయసుధ కామెంట్స్ చేసింది. అదేవిధంగా తాను చరణ్ తో నటుస్తున్నప్పుడు చిరంజీవి కొడుకు అనీ మహేష్ తో నటిస్తున్నప్పుడు కృష్ణ కొడుకు అనీ వారి బ్యాక్ గ్రౌండ్ చూడను అనీ ఆ సీన్ లో వారు ఎంత బాగా నటించగలుగుతున్నారు అన్న విషయాన్ని తాను పరిశీలిస్తాను అంటూ జయసుధ యంగ్ హీరోస్ పై తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

దీనితో జయసుధ చేసిన కామెంట్స్ పై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. మెగా హీరోల భజన లేకుండా ఎంత సీనియర్ ఆర్టిస్ట్ అయినప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగలేరు అని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న పరిస్థుతులలో జయసుధ ఏకంగా మెగా హీరోలు అంటే ఎవరు అంటూ చేసిన కామెంట్స్ వెనక ఆంతర్యం ఏమిటి అంటూ అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: