విజయ్ దేవరకొండ సినిమాలలో లిప్ లాక్ సీన్స్ లేకుండా సన్నివేశాలు ఉండవు. వచ్చేనెల విడుదల విడుదల కాబోతున్న ‘డియర్ కామ్రేడ్’ మూవీలో కూడ విజయ్ రష్మికల మధ్య హాట్ లిప్ లాక్ సీన్స్ ఉండబోతున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో త్వరలో విజయ్ దేవరకొండతో ఒక మూవీని చేయబోతున్న రాశి ఖన్నా తనకు కూడ లిప్ లాక్ సీన్ కావాలి అని తనకు తానుగా అడగడం షాకింగ్ న్యూస్ గా మారింది. 

ఆసక్తికరమైన ఈన్యూస్ వివరాలలోకి వెళితే రాశి ఖన్నా విశాల్ తో కలిసి  'అయోగ్య' చిత్రంలో నటించింది. ఈ చిత్రం విడుదల నేపథ్యంలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాశి ఖన్నా విజయ్ దేవరకొండ లిప్ లాక్ సీన్స్ పై తనకు ఉన్న ఆసక్తిని బయట పెట్టింది. 

ఆ ఇంటర్వ్యూ చేస్తున్న మీడియా సంస్థ ప్రతినిధి రాశి ఖన్నాను ఉద్దేశించి ప్రశ్నిస్తూ ‘మీరు హీరో విజయ్ దేవరకొండ అయితే ఏ హీరోయిన్ కు ముద్దు పెట్టాలని భావిస్తున్నారు’ అంటూ అడిగిన ఆ ప్రశ్నకు రాశి ఆసక్తికర సమాధానం ఇచ్చింది. ‘తను తరువాత సినిమాలో నటించే హీరోయిన్ కు ముద్దు పెట్టాలి’ అని బావిస్తున్నట్లు చెప్పి మరో ట్విస్ట్ ఇచ్చింది. 

వాస్తవానికి క్రాంతి మాధవ్ దర్శకత్వంలో త్వరలో విజయ్ దేవరకొండ్ నటిస్తున్న సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అయితే క్రాంతి మాధవ్ సినిమాలు విభిన్నంగా ఉండటమే కాకుండా లిప్ లాక్ సీన్స్ జోలికి ఈ దర్శకుడు వెళ్ళాడు. ఇలాంటి పరిస్థుతులలో తనకు విజయ్ దేవరకొండతో లిప్ లాక్ సీన్స్ క్రియేట్ చేయమని రాశి ఖన్నా వ్యూహాత్మకంగా అడుగుతోందా అంటూ కొందరు రాశి చేసిన కామెంట్స్ ను చూసి అభిప్రాయపడుతున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: