తెలుగు ఇండస్ట్రీలో 90వ దశకంలో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన హీరోయిన్ జయసుధ.  ఈమె నటన ఎంతో సహజత్వంగా ఉంటుంది కనుకనే ఆమెను సహజనటి అంటారు.  ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన జయసుధ తల్లి, అమ్మమ్మ పాత్రల్లో నటిస్తుంది. ప్రస్తుతం స్టార్ హీరోలందరికీ ఆమె అమ్మగా నటించిన విషయం తెలిసిందే. వంశి పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ‘మహర్షి’చిత్రంలో ఆయన తల్లిగా నటిస్తుంది. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్న జయసుధని యాంకర్   'మహేష్ బాబుకి, మెగాహీరోలకు తేడా ఏంటని..?' ప్రశ్నించింది. వెంటనే ఆమె 'మెగాహీరోలు అంటే ఎవరు..?' అని ఎదురు ప్రశ్నించారు.  ఓహో మీ మీడియా వారు, ఫ్యాన్స్, ప్రొడ్యూసర్స్ అలా ఆ ఫ్యామిలీ హీరోలను పిలుస్తారు..కానీ మేము కో ఆర్టిస్టులం కనుక మేము అలా ఎప్పుడూ భావించమని, వారిని కూడా అందరిలానే నటులుగా చూస్తామని తెలిపారు.  అయితే మాతో నటించే ప్రతి ఆర్టిస్టు  సరిగా నటిస్తారా..కొత్త వారికైతే నటన అనుభవం గురించి కాస్త చెప్పడం జరుగుతుంది.

అంతే తప్ప మెగాఫ్యామిలీ అనే తేడా ఏం ఉండదని, అంతకంటే మెగా మెగాలను చూశామని చెప్పుకొచ్చారు. ఎన్టీ రామారావు దగ్గర నుండి ఇప్పటివరకు ఎన్నో చూశామని, అది పెద్ద విషయం కాదని అన్నారు. ఇక కొత్తగా వచ్చే నటులు అయినా సరే..మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే నటులైనా సరే ఒక్కొక్కరికి ఒక్కో స్వభావం ఉంటుంది. కొంతమంది మెగాఫ్యామిలీ నుండి వచ్చినా.. చాలా పద్దతిగా ఉంటారని, కొంతమందికి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా యాటిట్యూడ్ చూపిస్తారని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: