ఈ మద్య భారత దేశంలో హాలీవుడ్ సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. గతంలో హాలీవుడ్ సినిమాలంటే..జెమ్స్ బాండ్, రాంబో మరికొన్ని కామెడీ సినిమాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే వారు.  కానీ ఇటీవల కాలంలో మల్టీప్లెక్స్ థియేటర్లు వచ్చినప్పటి నుంచి హాలీవుడ్ సినిమాల ప్రాధాన్యత ఎక్కువగా పెరిగిపోయింది.  హాలీవుడ్ ని తెలుగు లో డబ్ చేయడం..ఇక్కడ రిలీజ్ చేయడం కామన్ అయ్యింది.  


ఇక స్టార్ హీరోల సినిమాలు ఉన్న సమయంలోనే ఇలాంటి ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చేస్తున్నారంటే..వాటి స్టామినా ఏంటో తెలిసిపోతుంది.  తాజాగా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘అవెంజర్స్-ఎండ్ గేమ్’సినిమాకు ఇప్పుడు ఎదురే లేకుండా పోతుంది.  తెలుగు లో మజిలీ, జెర్సీ, కాంచన 3 లాంటి సినిమాలతో ఢీ కొంటు అవెంజర్స్ ఎండ్ గేమ్ భారీ కలెక్షన్లు రాబడుతుంది.


ఇక బాలీవుడ్ లో కూడా అవెంజర్స్ ఎండ్ గేమ్ కలెక్షన్లలో అరాచకం సృష్టిస్తుంది.  దంగల్ - సుల్తాన్ - టైగర్ జిందా హై... ఇలా బాలీవుడ్ టాప్ సినిమాల రికార్డులు అవెంజర్స్ దెబ్బకి మొదటి వారంలోనే బ్లాస్ట్ అయ్యాయి.అయితే అవెంజర్స్ సిరీస్ లకు రాను రాను ఫ్యాన్ ఫాలోయింగ్ స్ట్రాంగ్ గా పెరిగింది. ఫైనల్ గా లాస్ట్ సిరీస్ ఎండ్ గేమ్ తో ఇప్పటి వరకు ఉన్న బాలీవుడ్ టాప్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని ఈ సినిమా బీట్ చేసింది. 


అవెంజర్స్:ఎండ్ గేమ్  - 260.40  కోట్లు


 బాహుబలి2 (హిందీ)- 240.00 కోట్లు


సుల్తాన్ - 229.16 కోట్లు 


టైగర్ జిందా హై- 206.04 కోట్లు 


సంజు - 202.51 కోట్లు  


దంగల్- 197.54 కోట్లు


మరింత సమాచారం తెలుసుకోండి: