రాజకుమారుడు సినిమా నుండి మహర్షి వరకు మహేష్ చేసిన 25 సినిమాలతో ప్రిన్స్ నుండి సూపర్ స్టార్ గా మారాడు. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో తన ల్యాండ్ మార్క్ మూవీగా వస్తున్న సినిమా మహర్షి. ఈ సినిమా ఈనెల 9న రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. సినిమా తప్పకుండా మహేష్ ఫ్యాన్స్ కాలర్ ఎగురవేసేలా ఉంటుందని అంటున్నారు.


మహేష్ ఎక్కువగా ఒకేరకమైన లుక్ తో కనిపిస్తాడు.. కాని మహర్షిలో మూడు వేరియేషన్స్ లో రిషి పాత్ర ఉంది. రిషి జర్నీలో భాగం అయ్యేలా ఫ్యాన్స్ అందరు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా ఓ కమర్షియల్ ఎంటర్టైనర్ గా మాత్రమే కాదు మంచి కథ.. మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు డైరక్టర్ వంశీ పైడిపల్లి.


మహేష్ బొమ్మ కనబడితేనే సినిమా సూపర్ హిట్ చేసే ఫ్యాన్స్ ఉండగా మంచి కథ.. అందుకు తగిన కథనం.. అదిరిపోయే మ్యూజిక్.. అన్నిటిని మించి మహేష్ నటన ఇవన్ని సినిమాకు ఆకర్షణ అని చెప్పొచ్చు. పూజా హెగ్దె గ్లామర్ కూడా సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. సినిమాలో అల్లరి నరేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడని తెలిసిందే.


స్టార్ సినిమాలో కథ ఉన్నా లేకున్నా ఫ్యాన్స్ కోరుకునే అంశాలు ఉంటే చాలు సినిమా హిట్ చేస్తారు. అలాంటిది ఓ మంచి కథతో వస్తున్న మహర్షి తప్పకుండా సంచలనాలు సృష్టించి ప్రతి సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్ కాలర్ ఎగురవేసే సినిమా అవుతుందని అంటున్నారు. మరి ఆ ప్రభంజనం ఎలా ఉంటుందో చూడాలంటే మరో ఐదురోజులు వెయిట్ చేస్తే సరిపోతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: