దాసరి నారాయణరావు. ఆ పేరులో ఎంతో గాంభీర్యం ఉంది. ఆయన 1972 నుంచి 2015 వరకూ వరసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. 150కి పైగా మూవీస్ తీసిన గ్రేట్ డైరెక్టర్. మాటలు, పాటలు, కధ, స్క్రీన్ ప్లే, నటన, నిర్మాణం ఇలా బహుముఖమైన ప్రతిభా పాటవాలు దాసరి సొంతం. దాసరి అనూహ్యంగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. 


ఆయన 2017 మే 4న తన పుట్టిన రోజును అందరి సమక్షంలో జరుపుకున్నారు. ఇక తనకు తిరుగులేదని తానే అందరికీ ధీమాగా చెప్పారు. కానీ విధి విచిత్రం. అదే నెల 30న ఆయన కన్నుమూశారు. అనారోగ్యం మరో మారు తిరగతోడడంతో దాసరి ఇక లేరు అన్న చేదు నిజం అంతా వినాల్సివచ్చింది. దాసరి తన సినీ కెరీర్లో ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించారు. ఆయన సాంఘిక చిత్రాల్లోనూ ఎన్నో భిన్నమైన కధలతో మూవీస్ తీశారు. అలాగే తాండ్ర పాపారాయుడు, విశ్వనాధనాయకుడు వంటి  హిస్టారికల్ మూవీస్ కూడా తీసారు.


టీవీలో విశ్వామిత్ర పేరిట  ధారావాహికతో పౌరాణికాల్లోనూ తనకు సాటి లేదనిపించుకున్నారు. అయితే వెండి తెరపై అద్భుతమైన పౌరాణిక చిత్రాన్ని తీయాలని అది తీసి రిటైర్ కావాలని దాసరి భావించారు. దీనిని  ఎన్నో ఇంటర్వ్యూల్లో కూడా ఆయన చెప్పారు.  భారతీయ భాషల్లో మహా భారతాన్ని నాలుగు భాగాలుగా తీయాలన్నది దాసరి చివరి కోరిక. ఇపుడు ఉన్న ఆధునిక సాంకేతిక సంపత్తిని ఉపయోగించుకుని సెల్యూలాయిడ్ మీద కనీ వినీ ఎరగని మ్యాజిక్ చేసి చూపించాలని దాసరి కలలు కన్నారు. అయితే ఆ కల నెరవేరకుండానే ఆయన కన్ను మూయడం విషాదమే.


మరింత సమాచారం తెలుసుకోండి: