రకుల్ ప్రీతీ సింగ్ హిందీలో అజయ్ దేవగన్ సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లో 50 ఏళ్ల వ్యక్తి తో ప్రేమలో పడే పాత్రలో నటిస్తుంది. అయితే సినిమాలో చేసినట్టే నిజ జీవితంలో చేయడానికి కూడా తనకు అభ్యంతరం లేదని అంటోంది రకుల్ ప్రీత్ సింగ్. ఆమె ప్రస్తుతం నటిస్తున్న ఒక సినిమాలో యాభైయేళ్ల వయసున్న వ్యక్తి ప్రేమలో పడే ఇరవై ఆరేళ్ల పడుచు పాత్రలో కనిపిస్తూ ఉందట. ఆ యాభై యేళ్ల వ్యక్తిగా అజయ్ దేవగణ్ నటిస్తూ ఉన్నాడు.


పాతికేళ్లు నిండిన అమ్మాయిగా రకుల్ కనిపిస్తూ ఉంది. ఆ వ్యక్తికి అప్పటికే పెళ్లి కూడా అయి ఉంటుందట. ఆయన భార్యగా టబు నటిస్తోంది. ఈ పతీ, పత్నీ  ఔర్ ఓ కథతో ఇదివరకూ బాలీవుడ్ లో బోలెడన్ని సినిమాలు వచ్చాయి. వాటిల్లో ఇది ఏ రకంగా ప్రత్యేకంగా నిలుస్తుందో చూడాల్సి ఉంది. ఆ సంగతలా ఉంటే.. నిజ జీవితంలో అలాంటి పరిస్థితి ఎదురైతే ఎలా వ్యవహరిస్తావు? అనే ప్రశ్నకు రకుల్ ఆసక్తిదాయకమైన సమాధానాన్ని ఇచ్చింది.


ఈ సినిమా ప్రమోషన్ కోసం అలా చెప్పిందో ఏమోకానీ.. తనకు నిజ జీవితంలో కూడా ప్రియుడి వయసుతో సంబంధం లేదని చెప్పింది. తను ప్రస్తుతం ప్రేమలో పడటానికి ఎదురుచూస్తూ ఉన్నట్టుగా చెప్పుకొచ్చింది. తనకు అతడి వయసుతో సంబంధం లేదని.. ముసలాడైనా, యువకుడు అయినా ఓకే అని.. ప్రేమలో పడటం కోసం అయితే ఎదురుచూస్తున్నట్టుగా రకుల్ వివరించింది!

మరింత సమాచారం తెలుసుకోండి: