తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు అరడజను మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు.  మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఆయన తమ్ముడు పవన్ కళ్యాన్ మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.  ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో వెళ్లారు.  వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’తో చిరంజీవి ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చారు.  ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’చిత్రంలో నటిస్తున్నాడు.  


మెగా ఫ్యామిలీ నుంచి ‘పిల్లా నువ్వు లేని జీవితం’చిత్రంతో  మెగాస్టార్ మేనళ్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  తాజాగా సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రంగంలోకి దిగాడు.  ఈ  చిత్రంలో వైష్ణవ్ జాలరి కుటుంబానికి చెందిన వ్యక్తిగా కనిపిస్తాడనే ప్రచారం జరిగింది. జాలరి లుక్ తోనే వైష్ణవ్ పోస్టర్ కూడా బయటికి వచ్చింది.గళ్ల లుంగీ, రంగు బనీను, నోట్లో బీడీ, భుజంపై 'వల'తో వైష్ణవ్ ఈ పోస్టర్లో మాస్ లుక్ తో కనిపిస్తున్నాడు.  


అయితే ఈ చిత్రానికి ‘జాలరి’అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.  కాకపోతే ఈ విషయం అఫిషియల్ గా బయటకు రాలేదు.  కాగా, ఈ చిత్రంలో విలన్ గా తమిళ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్నారట. అంతే కాదు ఈ చిత్రానికి మరో స్పెషల్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించడం.  మరి మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వైష్ణవ్, యువ హీరోలకి ఏ స్థాయి పోటీ ఇస్తాడో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: