కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఏ సినిమా తిసినా అది సూపర్ హిట్ కావాల్సిందే.  ఆయన తీసే సినిమాలు హాలీవుడ్ రేంజ్ లో ఉండటమే కాదు మంచి మెసేజ్ కూడా ఉంటుంది.  అందుకే శంకర్ డైరెక్షన్ లో నటించాలని ప్రతి సినీ హీరోకి ఉంటుంది.  సూపర్ స్టార్ రజినీకాంత్ 2.0 సినిమా తర్వాత శంకర్ విశ్వనటుడు కమల్ హాసన్ తో ‘ఇండియన్ 2’సినిమాకు ప్లాన్ చేశారు.  అప్పట్లో ఈ సినిమా కు నిర్మాతగా దిల్ రాజు వ్యవహరిస్తారని వార్తలు వచ్చాయి..అందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింటో హల్ చల్ చేశాయి. 

కానీ బడ్జెట్ విషయం విని దిల్ రాజు చిన్నగా తప్పుకున్నారు.  ఆ తర్వాత లైకా ప్రొడక్షన్స్ వారు ముందుకు వచ్చారు. మొదటి రెండు షెడ్యూల్స్ లైకా ప్రొడక్షన్స్ లో చిత్రీకరణ కూడా జరిగింది. అయితే శంకర్ కి లైకా వారికీ బడ్జెట్ విషయంలో విభేదాలు రావడంతో ఇండియన్ 2 చిత్రీకరణ ఆగిపోయింది.  దాంతో ఈ సినిమా ఆలస్యం కవడానికి కారణం కమల్ మేకప్ వలన అని ఒకసారి, కాదు కమల్ హాసన్ ఎలక్షన్స్ లో బిజీగా ఉండడంతో షూటింగ్ కి బ్రేకొచ్చిందనే అంటూ వార్తలు వచ్చాయి. 

తాజాగా ఇండియన్ 2ని నిర్మించమని శంకర్ రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్ ను సంప్రదించాడట. అయితే రిలయన్స్ వారు శంకర్ కి హామీ ఇవ్వకపోయినా.. లైకా ప్లేస్ లో రిలయన్స్ వారు ఈ సినిమాని నిర్మించే ఛాన్సెస్ ఉన్నట్లుగా చెబుతున్నారు.  మరి తమిళనాడులో ఎన్నికలు పూర్తైన తర్వాత కమల్ ముఖానికి రంగు వేసుకుంటారని.. ఈలోపు రిలయన్స్ విషయం కూడా తేలుతుందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: