టాలీవుడ్ సినీ ఫ్యాన్స్‌కు మచ్ అవైటెడ్ మూవీ మహర్షి ఈనెల 9న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేందుకు మ‌రో నాలుగు రోజులు మాత్ర‌మే ఉంది. ఇప్ప‌టికే మ‌హ‌ర్షి హంగామా స్టార్ట్ అవుతోంది. ట్రైల‌ర్ ఇచ్చిన ఉత్సాహంతో మ‌హ‌ర్షి అభిమానులు ఫుల్ జోష్‌లో సంబ‌రాల‌కు రెడీ అవుతున్నారు. ఇక తాజాగా సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఒక్క క‌ట్ కూడా లేకుండా యూ / ఏ స‌ర్టిఫికెట్ ఇచ్చింది.


ఇక మ‌హ‌ర్షి ర‌న్ టైం కూడా లాక్ అయ్యింది. 5 నిమిషాల తక్కువ మూడు గంటల నిడివి అంటే మొత్తం 175 నిమిషాల ర‌న్ టైంతో మ‌హ‌ర్షి సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఓ విధంగా చెప్పాలంటే ఈ నిడివి చాలా ఎక్కువే. ఈ సినిమాలో మ‌హేష్ మూడు షేడ్స్‌ల‌లో న‌టిస్తున్నాడు. ఫ‌స్టాఫ్‌లో కాలేజ్ స్టూడెంట్‌, బిజినెస్‌మేన్‌, రైతు పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నాడు. ఇక ఈ సినిమా ర‌న్ టైం ఇప్పుడు సినిమా ఫ్యాన్స్‌తో పాటు అటు బ‌య్య‌ర్ల‌ను తెగ టెన్ష‌న్ పెడుతోంది.


ఓ స్టార్ హీరో సినిమా ఏకంగా మూడు గంట‌ల పాటు చూడాలంటే ఓ విధంగా ఇబ్బందే. సినిమా ఏ మాత్రం లాగ్ అయినా ప్రేక్ష‌కుడు బోర్ ఫీల‌వుతాడు. ద‌ర్శ‌కుడు ప్ర‌తి సీన్ మెస్మ‌రైజ్ చేసేలా తెర‌మీద ప్ర‌జెంట్ చేస్తేనే క‌ళ్లార్ప‌కుండా చూసే ఛాన్స్ ఉంటుంది. సినిమా రిజ‌ల్ట్ తేడా కొట్టినా, టాక్ డివైడ్‌గా ఉన్నా, స్లో అన్నా అది సినిమా ఫ‌లితంపై ఖ‌చ్చితంగా ప్ర‌భావం చూపుతుంది. బాహుబ‌లి, రంగ‌స్థ‌లం లాంటి సినిమాల ర‌న్ టైం ఎక్కువుగా ఉన్నా సినిమాలో కంటెంట్ ఉండడంతో లాంగ్ ర‌న్‌టైంను ప్రేక్ష‌కుడు ప‌ట్టించుకోలేదు. దీంతో ఇప్పుడు ఈ ర‌న్ టైంపై బ‌య్య‌ర్ల‌లోనూ టెన్ష‌న్ ఉంది. మ‌రి మ‌హేష్ ర‌న్ టైం మ‌ర్చిపోయేలా మురిపిస్తాడో ?  లేదో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: