అన్ని అనుకున్నట్టు జరిగినట్లయితే సుకుమార్  మహేష్ కాంబినేషన్ లో ఒక సినిమా సెట్ అయి ఉండాలి. కానీ ఆ సినిమా క్యాన్సల్ అయ్యింది. మహేష్ బాబు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుకుమార్ తో మూవీ క్కాన్సిల్ గురించి మాట్లాడుతూ 'మహర్షి' వంటి సీరియస్ సినిమా చేసిన తర్వాత ఒక ఎంటర్ టైన్ మెంట్ సినిమాను చేయాలనుకున్నాను. అయితే సుకుమార్ తెచ్చింది కూడా మళ్లీ సీరియస్ స్క్రిప్ట్ అవ్వడం వల్ల ఆ సినిమాను పక్కకు పెట్టాను.


ఎంటర్ టైన్ మెంట్ తో కూడి ఉన్న అనీల్ రావిపూడి స్క్రిప్ట్ కు ఓకే చెప్పాను. నా నిర్ణయంను సుకుమార్ కూడా ఆనందంగా అభినందించాడు. ఇప్పుడు కాకున్నా తర్వాత అయినా సుకుమార్ తో నా సినిమా ఉంటుంది కేవలం సుకుమార్ తోనే కాకుండా రాజమౌళి తో కూడా నా సినిమా ఉంటుందని మహేష్ బాబు ప్రకటించాడు.సుకుమార్ తో సినిమా ఎప్పుడు ఏంటీ అనే విషయాన్ని చెప్పని మహేష్ బాబు జక్కన్న రాజమౌళితో సినిమా గురించి మాత్రం ఆసక్తికర కామెంట్ చేశాడు.


త్వరలోనే ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని రాజమౌళి గారితో కథా చర్చలు జరుగుతున్నాయని మహేష్ బాబు చెప్పుకొచ్చాడు. అంతా ఓకే అయితే ఆర్ ఆర్ ఆర్ మూవీ అయిన తర్వాత రాజమౌళి - మహేష్ ల కాంబో వస్తుందేమో చూడాలి. బాహుబలి చిత్రం సమయంలోనే జక్కన్న తర్వాత సినిమా మహేష్ బాబుతో అన్నారు. కాని అది కుదరలేదు మరి ఇప్పుడు మహేష్ మరోసారి జక్కన్నతో సినిమా అంటూ చెప్పడం వల్ల మరోసారి చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: