పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాలు చేస్తాడని ప్రచారం ఊపందుకున్నది. అయితే గత రెండు రోజులుగా పవన్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్ ఇటీవలే మీటింగ్ జరిపాడని ప్రచారం జరగడంతో అభిమానులు కన్ఫ్యూజ్ అయ్యారు. నిజంగా చేస్తాడా అని ఆశించిన వారు కూడా లేకపోలేదు. ఇది కాస్తా వైరల్ కావడంతో హరీష్ శంకర్ ఎట్టకేలకు స్పందించాడు.


పవన్ తో సినిమా చేయడాన్ని ఎప్పుడూ ప్రేమిస్తానని అయితే జరుగుతున్న ప్రచారం ఇంకోలా ఉండటంతో క్లారిటీ ఇస్తున్నానని చెప్పి అసలు పవర్ స్టార్ ని కలవనేలేదని దీనికి చెక్ పెట్టేశాడు.ఇక వాల్మీకిలో పూజా హెగ్డే గురించి చెప్పిన హరీష్ శంకర్ రెమ్యునరేషన్ విషయంలో వస్తున్న వార్తలన్నీ నిరాధారమైనవని కొట్టిపారేశాడు. అయితే వాల్మీకిలో పూజా హెగ్డే ఉందా లేదా అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. మొత్తానికి పవన్ సినిమాలు చేయడం లేదనే క్లారిటీ వచ్చేసింది.


ఎలాగూ ఫలితాలు 23కు వచ్చేస్తాయి కాబట్టి తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి అప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఇబ్బందిగా ఉండదు . ఒకవేళ పవన్ సినిమాలు చేస్తాను అన్నా ఫాన్స్ సాదరంగా రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు. క్రేజ్ విషయంలో ఎలాంటి మార్పు ఉండదు కాబట్టి బిజినెస్ పరంగా వచ్చిన ఇబ్బంది ఏమి లేదు. హరీష్ శంకర్ కలిసింది నిజం కాకపోయినా భవిష్యత్తులో పవన్ సినిమాలు చేసే అవకాశాన్ని కొట్టి పారేయాలెం. అదే జరిగితే ముందు వరసలో ఉన్న మైత్రికే మొదటి ప్రాధాన్యత దక్కుతుంది. చూడాలి ఎలాంటి పరిణామం చోటు చేసుకోబోతోందో. 

మరింత సమాచారం తెలుసుకోండి: