టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది పెద్ద పెద్ద దర్శకులు సంవత్సరాల పాటు సినిమాలు తీసి ఇండస్ట్రీ హిట్లు కొట్టేవారు. అయితే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మాత్రం కేవలం కొద్ది రోజుల వ్యవధిలో అని సినిమాలు తీసి భారీ ఇండస్ట్రీ హిట్లు కొట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం పూరి జగన్నాథ్ మాత్రం చాలా స్లో అయిపోయాడు.

Image result for puri ram

దీనికి కారణం ఏమిటంటే వరుసగా చేస్తున్న సినిమాలు ఫ్లాప్ అవుతున్న క్రమంలో..స్లో అండ్ స్టడీ అన్న రీతిలో ఈసారి ఖచ్చితంగా హిట్ పడాలని రామ్ తో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ గత కొన్ని నెలల నుండి జరుగుతూనే ఉంది. ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ కాలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా ఈ నెలలో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

Image result for puri ram

పూరి ఓ డేట్ చెప్పి రిలీజ్ చేయకపోవడం ఇదే మొదటిసారేమో .. కాకపోతే చిత్రబృందం ఆలోచన మరో విధంగా ఉంది. మేలో పెద్ద సినిమాల తాకిడి ఎక్కువగా ఉండడంతో ఈ సమయంలో రిలీజ్ చేయడం కంటే హడావిడి పూర్తయిన తరువాత రిలీజ్ చేయడం మంచిదని భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాను పూరి జగన్నాథ్ నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్ నెలలో ఏ సినిమా విడుదలయ్యే అవకాశం లేని సమయాన్ని చూసి సరైన స్కెచ్ వేసి సినిమాని విడుదల చేసి సేఫ్ గేమ్ ఆడాలనే ఆలోచనలో పూరి జగన్నాథ్ ఉన్నట్లు తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: