‘మహర్షి’ రిలీజ్ కు ఇక కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇలాంటి పరిస్థితులలో ఈమూవీకి సాధ్యమైనంత భారీ హైక్ ను తీసుకు వచ్చి మహేష్ కెరియర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టే విధంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఈసినిమాకు పోటీగా మరి ఏ భారీ సినిమా ఇప్పట్లో విడుదల కాని నేపధ్యంలో ‘మహర్షి’ కి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కలక్షన్స్ సునామి ఖాయం అన్న మాటలు వినిపిస్తున్నాయి. 

ఇలాంటి పరిస్థుతులలో ఈసినిమాకు సంబంధించి మొదటి వారం రోజులు ప్రతిరోజు 6 షోలు ప్రదర్శించడానికి ‘మహర్షి’ నిర్మాతలు మన ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు పర్మిషన్స్ కోసం అభ్యర్ధనలు పంపినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఈసినిమా ప్రదర్శింపబడే మన ఇరు రాష్ట్రాలలోని సింగిల్ ధియేటర్లలో టిక్కెట్ ధరను 200 రూపాయలకు పెంచుకునే విధంగా అనుమతించమని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. 

అయితే గత కొంత కాలంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టాప్ హీరోల సినిమాలకు సంబంధించి ఇలాంటి టిక్కెట్ పెంపుదలకు అదేవిధంగా స్పెషల్ షోలకు ముఖ్యంగా తెల్లవారుజామున ప్రదర్శింపబడే ప్రీమియర్ షోలకు అనుమతులు ఇవ్వడం లేదు. దీనికితోడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న పరిస్థితులలో ఇలాంటి అభ్యర్ధన పై అక్కడి ప్రభుత్వం ‘మహర్షి’ నిర్మాతలకు సహాయం చేయ గలుగుతుందా అన్న సందేహాలు కూడ కలుగుతున్నాయి. 

దీనితో ‘మహర్షి’ రికార్డుల వేట కొనసాగాలి అంటే ఈమూవీ టిక్కెట్ ధరను పెంచే విషయంలో మన ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల  సహాయ సహకారాలు కావాలి. ఇలాంటి పరిస్థుతులలో ‘మహర్షి’ రికార్డులకు స్పెషల్ షోలు టిక్కెట్ ధర పెంపు కీలకంగా మారింది. అయితే మహేష్ కు అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని కీలక నేతలతోను అదేవిధంగా ఇటు తెలంగాణ ప్రభుత్వంలోని ముఖ్య నేతలతోను మంచి సాన్నిహిత్యం ఉండి మహేష్ అందరి వాడుగా కొనసాగుతున్న పరిస్థుతులలో ‘మహర్షి’ కోరికల పై మన రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయి అన్న విషయమై ‘మహర్షి’ ఓపెనింగ్ రికార్డ్స్ ఆధారపడి ఉంటాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: