రెండు రోజుల క్రితం ఒక ప్రముఖ ఇంగ్లీష్ ఛానల్ త్వరలో రాబోతున్న ఎన్నికల ఫలితాల పై జరిపిన ఒక చర్చా కార్యక్రమంలో చంద్రబాబునాయుడు మాట్లాడుతూ గతంలో వచ్చిన సంకీర్ణ ప్రభుత్వాలు అన్నీ చాలచక్కగా పనిచేసాయి అని కామెంట్స్ చేసారు. దీనితో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి అనుకున్న స్థానాలు రాకపోతే ‘జనసేన’ తో పొత్తుకు తాను రెడీ అన్నసంకేతాలు ఇవ్వడానికే ప్రత్యేకంగా చంద్రబాబు ఇలా ఆ ఇంగ్లీష్ ఛానల్ లో సంకీర్ణ ప్రభుత్వాలకు జై కొట్టారు అన్న కామెంట్స్ వస్తున్నాయి.

ఇది ఇలా ఉంటే మరో ప్రముఖ దినపత్రిక రాబోతున్న ఎన్నికల ఫలితాలలో పవన్ ‘జనసేన’ కు 40 నుంచి 50 సీట్లు వస్తాయి అంటూ చేసిన ఒక లేటెస్ట్ అంచనా పవన్ అభిమానులకు విపరీతమైన జోష్ ను ఇస్తోంది. ఆ పత్రిక అంచనాలు నిజం అయితే ఖచ్చితంగా రాబోతున్న ఎన్నికల ఫలితాల తరువాత పవన్ కింగ్ మేకర్ కాబోతున్నాడా అన్న సందేహాలు కలగడం వాస్తవం. 

ఇది చాలదు అన్నట్లుగా మరొక న్యూస్ ఛానల్ పవన్ పై మరొక ఆసక్తికర కథనాన్ని ప్రసారం చేసింది. భీమవరం గాజువాక ఇలా ఈ రెండు స్థానాలలో పవన్ గెలుపు ఖాయం అని భావిస్తున్న ఆంధ్రప్రదేశ్ లోని పందెం రాయుళ్ళు పవన్ నెగ్గితే వెయ్య రూపాయలు ఓడిపోతే ఐదు వేలు చప్పున దామాషాలో వేస్తున్న పందాలు ఇప్పటికీ కొనసాగుతూ ఉండటంతో పవన్ ‘జనసేన’ బయటకు కనిపించని నిశ్శబ్ద విప్లవాన్ని కొనసాగించిందా అంటూ ఆ న్యూస్ ఛానల్ వ్యక్త పరిచిన అభిప్రాయాలు దేనికి సంకేతం అన్న కోణంలో కూడ చర్చలు జరుగుతున్నాయి. 

ఇలాంటి పరిస్థుతులలో చంద్రబాబు నిన్నటి నుండి మొదలుపెట్టిన ఎన్నికల అభ్యర్ధులతో జరుపుతున్న సమీక్షా సమావేశాలలో పవన్ ‘జనసేన’ కు ప్రతినియోజక వర్గంలో ఎంత శాతం ఓట్లు పడ్డాయి అన్న విషయమై అభ్యర్ధుల నుండి సమాచారాలు సేకరిస్తున్నట్లు టాక్. దీనితో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు దూరంగా పవన్ హైదరాబాద్ లో ఉన్నా పవన్ ‘జనసేన’ ప్రభావం గురించి చర్చలు తెలుగు మీడియా ఛానల్స్ నుండి జాతీయ మీడియా ఛానల్స్ వరకు ఇంకా ఎక్కడో అక్కడ కొనసాగుతూ ఉండటం అత్యంత ఆశ్చర్యంగా మారింది..  


మరింత సమాచారం తెలుసుకోండి: