"అర్జున్ సురవరం" యువకథానాయకుడు నిఖిల్ చేస్తున్న తాజా చిత్రం. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం తమిళ సూపర్ హిట్ "కణితన్" కు రీమేక్ . ఆరా సినిమాస్ మరియు డైనమిక్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి తమిళ దర్శకుడు టీఎన్ వెంకటేష్ దర్శకత్వం వహించారు. 

ఇక ఎప్పటి నుండో విడుదల అవ్వాల్సిన ఈ చిత్రం వాయిదాల మీద వాయిదాలు పడిన విషయం తెలిసందే. అనేక వాయిదాల అనంతరం ఈ చిత్రాన్ని మే 17న విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్దమయ్యారు. ఇదిలా ఉండగా ఈ చిత్ర డిస్ట్రిబ్యూషన్ హక్కులను   ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటెర్నేష్నల్ మంచి ధరకు కొనుగోలు చేసిందట. 
 
ఇప్పటివరకు కనీస ప్రమోషన్స్ కూడా చేయలేని స్థితిలో ఉన్న "అర్జున్ సురవరం" సినిమాకి ఈరోస్ సంస్థ తోడవడంతో పబ్లిసిటీ జోరందుకుందిట, ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ప్రోమో కట్స్, పోస్టర్స్ ను కొత్తగా డిజైన్ చేస్తున్నారట. దీంతో త్వరలోనే పబ్లిసిటీ జోరు మరింత పెంచే ఆలోచనలో ఉందిట "అర్జున్ సురవరం" టీం. 

ఇక గత ఏడాది "కిరాక్ పార్టీ"తో భారీ ప్లాప్ ని చవిచూసిన నిఖిల్ ఈ ఏడాది "అర్జున్ సురవరం"తో మంచి విజయాన్ని అందుకోవాలనుకుంటున్నాడు, అయితే టైటిల్ విషయంలో వివాదాలు, విడుదలలో జాప్యం వంటి విషయాలు నిఖిల్ ని కలవరపెడుతున్నాయి. మరి అన్ని అనుకున్నట్టుగా "అర్జున్ సురవరం" ఈ 17న విడుదలై విజయాన్ని సాధిస్తాడా? లేదా? అనేది వేచి చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: