ఇటు టాలీవుడ్ లోను అటు కోలీవుడ్ లోను టాప్ స్టార్స్ అందరితో కలిసి నటించింది అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ , ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్న రకుల్ అజయ్ దేవగన్ తో కలిసి నటించిన "దే దే ప్యార్ దే" చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో పెళ్ళైన అజయ్ దేవగన్ ను ప్రేమించే యువతిగా నటించింది రకుల్. 

ఇక ఈ చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్, ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చింది. "మీ జీవితంలో ప్రేమకు చోటుందా? " అని విలేకరి అడగగా "స్వచ్ఛమైన ప్రేమ కోసం నేనింకా ఎదురు చేస్తున్నాను, ఆలాంటి ప్రేమ దొరికినప్పుడు అతను నాకంటే వాయసులో పెద్దవాడా, ముసలివాడా లేక చిన్నవాడా అనే తారతమ్యాలు నేను పట్టించుకోను" అని తెలిపింది. 

ఇక సౌత్ లో గత ఏడాది కాస్త గ్యాప్ ఇచ్చిన రకుల్ ఇప్పుడు మళ్ళీ తెలుగులో నాగార్జున తో "మన్మధుడు2" చేస్తున్న రకుల్ తమిళంలో సూర్య తో "ఎన్ ఙికే " లో కీలకపాత్రలో నటించింది. వీటిలో "మన్మధుడు2" చిత్రం షూటింగ్ దశలో ఉండగా, "ఎన్ ఙికే" చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. వీటితో పాటు విజయ్ 64లో కూడా రకుల్ నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: