స్టార్ డైరెక్టర్ వంశి పైడిపల్లి దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ‘మహర్షి’మే 9 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.  ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఎంతో వైభవంగా జరిగింది.  ఈ సందర్భంగా మహేష్ బాబు తనతో సినిమాలు తీసిన అందరు దర్శకు గురించి మాట్లాడారు.  రాజకుమారుడు దర్శకులు రాఘవేంద్ర రావు గురించి మొదలు పెట్టి..ప్రస్తుతం మహర్షి దర్శకుడు వంశి పైడిపల్లి గురించి మాట్లాడారు. 

కానీ ఇక్కడే ఆయన పెద్ద పొరపాటు చేశారు..అదే ‘పోకిరి’,‘బిజినెస్ మాన్’లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన పూరీ జగన్నాథ్ పేరు ప్రస్తావించడం మరిచారు.  దీనిపై సోషల్ మీడియాలో కొన్ని విమర్శలు రావడంతో..వెంటనే స్పందించిన నాకు పోకిరి లాంటి సక్సెస్ ఇచ్చిన పూరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.   తాజాగా ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, అందుకు వివరణ ఇచ్చారు.

నేను ఈవెంట్‌ కు వచ్చే ముందు సుమారు 16 గంటల సేపు జర్నీ చేశాను. యూరప్‌ నుంచి హైదరాబాద్ కు వచ్చాను.  అయితే ఫంక్షల్లో అభిమానులు కాస్త హడావుడి చేయడం.. ఆ హడావిడిలో పూరీ జగన్నాథ్ పేరును మరచి పోయాను. అది నా తప్పే. పూరి జగన్నాథ్‌ కు చాలా థ్యాంక్స్‌. 'పోకిరి' నన్ను సూపర్‌ స్టార్‌ ని చేసిన సినిమా అని మహేశ్ అన్నారు. 'మురారి' సినిమాను హైదరాబాద్ లో తన తండ్రి కృష్ణతో కలిసి చూశానని, సినిమా ముగిసిన తరువాత ఆయన తన భుజంపై చెయ్యి వేశారని, అది తన జీవితంలో మోస్ట్ మెమొరబుల్ మూమెంటని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: