తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోసగాళ్లు పెరిగిపోయారని ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నిసంవత్సరాల క్రితం ఛాంబర్ పేరు పెట్టుకని కొందరు దాదాపు 1200 మంది దగ్గర డబ్బు తీసుకుని పరారయ్యారని తమ్మారెడ్డి తన సొంత యూట్యూబ్ ఛానల్‌లో తెలిపారు. 


ఆ ఛాంబర్ పెట్టిన రోజే తాను ఇది నిలబడేది కాదని.. నమ్మొద్దని తాను చెప్పానని తమ్మారెడ్డి అంటున్నారు. ఈ ఛాంబర్ ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి, మంత్రులతో ఛాంబర్ నాయకులు ఫోటోలు దిగారని.. వాటిని చూపి సినీ ఇండస్ట్రీలోని వారిని మోసం చేశారని అన్నారు. ఇలాంటి వారిని
ముఖ్యమంత్రి కూడా దగ్గరకు రానీయకూడదని సూచించారు. 

ఓ సామాన్యుడు ముఖ్యమంత్రిని కలవాలంటే.. చాలా కష్టమని..కానీ ఇలాంటి మోసగాళ్లను గుర్తించకుండా ఎవరిని పడితే వాళ్లను దగ్గరకు రానీయడం నేతలకు మంచిది కాదని హితవు పలికారు. మంత్రులు, ముఖ్యమంత్రితో దిగిన ఫోటోలతో వాళ్లు మోసాలకు దిగుతున్నారని తెలిపారు.

తాజాగా మీడియాలో కూడా సినిమా అవకాశాలపై స్క్రోలింగ్ ప్రకటనలు వస్తున్నాతయని.. గతంలో వీటిని నిలిపేశారని.. ఇప్పుడు మళ్లీ వస్తున్నాయని.. వాటిలో చాలావరకూ మోసం చేసేవే ఉంటున్నాయన్నారు. ఇలాంటి వాటిని మీడియా కూడా ప్రోత్సహించకూడదని తమ్మారెడ్డి హితవు పలికారు. సినీ ఇండస్ట్రీలోకి వచ్చేవారు అన్నీ జాగ్రత్తగా గమనించి అడుగేయాలని ఔత్సాహితుకలు సూచించారు తమ్మారెడ్డి భరద్వాజ. 



మరింత సమాచారం తెలుసుకోండి: