బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ... తెలుగులోని యువ కథానాయకుల అందరికంటే వేగంగా  వరుసగా సినిమాలు చేస్తున్నహీరో. అయితే తెలుగులో కనీస మార్కెట్ కూడా లేని బెల్లంకొండ శ్రీనివాస్ కి బాలీవుడ్ లో భారీ డిమాండ్ ఉందంటే నమ్ముతారా? చాలా మంది తెలుగు హీరోలకి లేని యూట్యూబ్ రికార్డ్స్ ఇప్పుడు బెల్లం బాబు సొంతమంటే మీరు నమ్మగలరా? 

వివరాలలోకి వెళితే..  డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన "అల్లుడు శీను" చిత్రంతో వెండితెరకు పరిచయాడు. ఆ తర్వాత బోయపాటి దర్శకత్వంలో వచ్చిన "జయ జానకి నాయక" చిత్రంతో మరో విజయం అందుకున్నాడు. ఇండస్ట్రీలో క్రేజ్ ఉన్న హీరోయిన్స్ అందరితో ఆడిపాడిన బెల్లంకొండ శ్రీనివాస్ నటుడిగా మాత్రం ఇంకా పూర్తి మార్కులని సంపాదించుకోలేకపోయాడు. 

ఇదిలా ఉండగా బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన "స్పీడున్నోడు" "కవచం" "సాక్ష్యం" చిత్రాలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. అయితే ఇవే చిత్రాలు ఇప్పుడు యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. "ఇన్స్పెక్టర్ విజయ్" పేరుతో హిందీలో డబ్ అయినా "కవచం" చిత్రం యూట్యూబ్ లో 50 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది. వీటితో పాటు "సాక్ష్యం"  "జయజనకి నాయక" చిత్ర హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కూడా 30 నుంచి 40 మిలియన్ వ్యూస్ తో దూసుకపోతున్నాయి. ఇవే కాకుండా నార్త్ అభిమానులు ఆ  సినిమా వీడియోస్ కింద "వి లవ్ బెల్లంకొండ  శ్రీనివాస్" అనే కామెంట్స్ చేయడం మరో విశేషం. 

దీంతో తెలుగులో ఏమాత్రం క్రేజ్ లేని శ్రీనివాస్ తనకి తెలియకుండానే హిందీ ప్రేక్షకుల అభిమానాన్ని చొరగొన్నాడు, ఇక ప్రస్తుతం తేజ దర్సకత్వంలో "సీత"  తమిళ రాచస్సన్ రీమేక్ అయిన "రాక్షసుడు" చిత్రాలలో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాల్లో త్వరలోనే విడుదల కాబోతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: