సూపర్ స్టార్ మహేష్ సినిమా అంటే బ‌డ్జెట్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఒక్కోసారి బ‌డ్జెట్ అన్‌లిమిటెడ్‌గా పెరిగిపోతుంటుంది. గ‌తంలో బ్ర‌హ్మోత్స‌వం, స్పైడ‌ర్‌, శ్రీమంతుడు, భ‌ర‌త్ అనే నేను సినిమాల బ‌డ్జెట్ కూడా ఇలాగే పెరిగిపోయింది. ఇప్పుడు మ‌హ‌ర్షి విష‌యంలోనూ సేమ్ కంప్లైంట్ రిపీట్ అయ్యింది. ఈ సినిమా బ‌డ్జెట్ అనుకున్న దానికంటే చాలా ఎక్కువ అయ్యింద‌ని చిత్ర నిర్మాత‌లే ఒప్పుకోవాల్సిన ప‌రిస్థితి.


మ‌హ‌ర్షి బ‌డ్జెట్ ఓవ‌ర్ అవ్వ‌డానికి కార‌ణాలు ఎన్ని ఉన్నా ప్ర‌ధాన కార‌ణం మాత్రం ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లియే అన్న టాక్ ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది. కొన్ని సీన్లు రీ షూట్ చేయ‌డం, మ‌రి కొన్ని చోట్ల సీన్లు మార్చ‌డం, ప్లానింగ్ లేక‌పోవ‌డం, బ‌డ్జెట్ కంట్రోల్ లేక‌పోవ‌డంతో బ‌డ్జెట్ బాగా ఎక్కువైంద‌ట‌. ఈ సినిమాకి దాదాపు 110-120 కోట్ల మేర బడ్జెట్ పెట్టారని ప్రచారమైంది. 


ఇక సినిమా ప్ర‌మోష‌న్ల‌లో మ‌హేష్ మాట్లాడుతూ క్వాలిటీ క‌థ దొరికిన‌ప్పుడు రాజీప‌డ‌కుండా ఉండేలా ముగ్గురు నిర్మాత‌లు దొర‌క‌డంతో సినిమా బ‌డ్జెట్ బాగా పెరిగిపోయింద‌ని మ‌హేష్ చెప్పాడు. క‌థ‌కు స్కోప్ ఎక్కువుగా ఉంద‌ని... న్యూయార్క్‌లో సీఈవో అంటే సీఈవోలాగే క‌న‌ప‌డాలి... ఖ‌రీదైన హెలీకాఫ్ట‌ర్లు, కార్లు ఆ రేంజ్‌లోనే ఉండాలి... ఎక్క‌డా రాజీప‌డ‌కుండా ఉండేలా నిర్మాతలు బ‌డ్జెట్ పెట్టిన‌ట్టు మ‌హేష్ చెప్పాడు.


ఇక త‌న కెరీర్‌లోనే బెస్ట్ బిజినెస్ చేసిన సినిమా క‌దా ? అన్న ప్ర‌శ్న‌కు స్పందిస్తూ... ఇంత భారీ బిజినెస్ చేయ‌డంతో గ‌ర్వంగా ఉన్నా ఓ వైపు భ‌యంగా కూడా ఉంద‌న్నాడు. రూ.120 కోట్ల బిజినెస్ చేస్తే సినిమా రూ.150 కోట్ల షేర్ వ‌సూలు చేయాల‌ని కూడా చెప్పాడు. అప్పుడే బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అవుతుంద‌ని కూడా చెప్పాడు. ఏదేమైనా ఓవ‌ర్ బ‌డ్జెట్‌పై మ‌హేష్ కూడా టెన్ష‌న్‌లోనే ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: